Realme Narzo 60x 5G Price and Specs in India: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘రియల్‌మీ’ ఇటీవల మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రియల్‌మీ నార్జో 60 సిరీస్‌లో భాగంగా నార్జో 60ఎక్స్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఈరోజు (సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయ్యాయి. రియల్‌మీ సహా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో రియల్‌మీ నార్జో 60ఎక్స్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.
అమెజాన్‌లో రియల్‌మీ నార్జో 60ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+ 128జీబీ (Nebula Purple 6GB,128GB Storage) వేరియంట్ ధర రూ. 15,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే 9 శాతం తగ్గింపు అనంతరం ఈ వేరియంట్ రూ. 14,999కి అందుబాటులో ఉంది. మరోవైపు నార్జో 60ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+ 128జీబీ (Stellar Green, 4GB, 128GB Storage) వేరియంట్ రూ. 14,999 ఉండగా.. 13 శాతం తగ్గింపు అనంతరం రూ. 12,999కి మీ సొంతం అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో ఈ ఫోన్స్ ధరలు మరింత తగ్గనున్నాయి.
Also Read: Vivo Y100 Price Drop: రెండోసారి తగ్గిన వివో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?
రియల్‌మీ నార్జో 60ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్ రానుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్ మీ 4.0, ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్ సిటీ 6100+ ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. 12 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇందులో ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఇందులో డ్యూయల్ నానో సిమ్ ఇస్తున్నారు. ఈ ఫోన్ నెబులా పర్పుల్, స్టెల్లర్ గ్రీన్ రంగుల్లో లభించనున్నాయి.