Realme C71: 6300mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ఫోన్ ఇంత తక్కవ ధరలో ఏంటి భయ్యా.. రియల్మీ C71 లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme C71: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ (Realme) తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ realme C71 ను భారత మార్కెట్లో నేడు విడుదల చేసింది. గత నెలలో C73 5G లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు C సిరీస్ లో మరో కొత్త బడ్జెట్ మొబైల్ ను తీసుకవచ్చింది. పక్కా బడ్జెట్ ధరలో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఆకర్షణీయమైన మంచి ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా 90Hz డిస్ప్లే, భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి.
డిస్ప్లే:
ఈ కొత్త రియల్మీ C71లో 6.67 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ ఇవ్వబడింది. ఇది 90Hz రిఫ్రెష్‌రేట్, 563 nits హెచ్‌బీఎమ్ (HBM) బ్రైట్నెస్ తో వస్తోంది. ఈ ఫోన్‌కు ‘పల్స్ లైట్ డిజైన్’ అనే ప్రత్యేక లైటింగ్ డిజైన్ ఉంది. ఇది 9 రంగుల్లో, 5 కస్టమైజబుల్ మోడ్లలో మెరుస్తూ మెసేజ్‌లు, కాల్స్, చార్జింగ్ స్టేటస్‌కి స్పందిస్తుంది. అలాగే ఇందులో ‘ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్’ ఉండటంతో 1.8 మీటర్ల ఎత్తునుండి పడినా, 33 కిలోల ప్రెషర్ వచ్చినా ఫోన్ సేఫ్‌గా ఉండేలా తయారుచేశారు. వీటితోపాటు IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో ఇది మరింత పదిలంగా ఉంటుంది.
Also Read
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్‌ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
Read Also:ENG vs IND: ‘ఒక్క ఛాన్స్’ ప్లేయర్ ఔట్.. నాలుగో టెస్ట్ భారత్ ప్లేయింగ్ 11 ఇదే!

ప్రాసెసర్:
ఈ ఫోన్‌ను Unisoc T7250 12nm ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తినిస్తుంది. ఇందులో 4GB లేదా 6GB LPDDR4X RAM, అలాగే 64GB లేదా 128GB స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి. ఈ స్టోరేజ్ ను 2TB వరకూ ఎక్స్‌పాండబుల్ మెమరీకి మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉంది. ఈ మొబైల్ Android 16 ఆధారిత realme UI 6.0 పై రన్ అవుతుంది.
కెమెరాలు:
ఈ కొత్త మొబైల్ కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో 13MP Omnivision OV13B సెన్సార్ ఉన్న కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా తో వస్తోంది.

బ్యాటరీ:
ఈ ఫోన్లో చెప్పుకోతగ్గ ఫీచర్స్ లో మొదటగా బ్యాటరీ గురించి చెప్పవచ్చు. ఇందులో 6300mAh భారీ బ్యాటరీ ఉంది. దీన్ని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 6W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఈ ఫోన్ ఇతర పరికరాలకు పవర్ బ్యాంక్‌లా పనిచేయగలదు.
Read Also:Janaki V vs State of Kerala : టైటిల్ మార్చిన జానకి సినిమా ట్రైలర్ వచ్చేసింది!
ఇక మొబైల్ ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi (2.4GHz + 5GHz), Bluetooth 5.2, GPS, GLONASS, Galileo, QZSS సపోర్ట్, USB Type-C పోర్ట్ ఉంటుంది. ఒబిసిడియన్ బ్లాక్, సీ బ్లూ అనే రెండు రంగులలో రియల్మీ C71 అందుబాటులో ఉంటుంది.

ధర:
realme C71 ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్, రియల్మీ వెబ్ సైట్స్ లో, అలాగే ఇతర ప్రధాన రీటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,699గా ఉంది. ఈ వేరియంట్‌కి ఎలాంటి బ్యాంక్ ఆఫర్ అందుబాటులో లేదు. అయితే, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,699గా ఉండగా.. దీనికి రూ.700 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో ఈ వేరియంట్‌కి ఫైనల్ ఎఫెక్టివ్ ధర రూ.7,999 అవుతుంది.
తాజావార్తలు
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
RJ Balaji: చరణ్‌తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
-
Krishnavataram Part 1: కృష్ణావతారం మూవీ టికెట్ల ధరపై.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?