Real Boom in Pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు రియల్ భూమ్ నడుస్తోందట.. దానికి ప్రధాన కారణం జనసేనాని పవన్ ప్రకటనే అంటున్నారు స్థానికులు.. పిఠాపురం నుంచి బరిలోకి దిగి.. భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు పవన్ కల్యాణ్.. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసార తన సొంత నియోజకవర్గంతో పాటు.. కాకినాడ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు.. దీనికి రియల్ భూమ్‌కి కారణం ఏంటి? అంటారా? విషయం ఏంటంటే.. పిఠాపురంలో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు పవన్.. 3.52 ఎకరాల భూమి కొన్నట్లు స్వయంగా పవన్ కల్యాణే ప్రకటించారు.. రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం, మిగతా స్థలంలో ఇల్లు కడతానని బహిరంగ వెల్లడించారు.. మరో 16 ఎకరాలు వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన పవన్.. దానికి రైతులతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని.. వచ్చే పర్యటనలో రిజిస్ట్రేషన్ కి అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also: Rangareddy: రంగారెడ్డి టీచర్ల బదిలీల్లో గందరగోళం.. రిటైర్డ్ అయిన టీచర్ కి పదోన్నతి..
ఇక, ఏ అవకాశాన్ని వదులుకోని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రంగ ప్రవేశం చేశారట.. పవన్ భూములు ఉన్న ప్రాంతాల్లో స్థలాలు కొనే వేటలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులు పడిపోయారట.. డిప్యూటీ సీఎం భూములు ఎక్కడ ఉన్నాయి, చుట్టూ పక్కల అమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటూ ఆరా తీస్తున్నారట.. ఇతర ప్రాంతాలకి చెందినవారు.. ఎప్పుడూ లేని విధంగా తమకు ఫోన్ లు చేసి భూములు రేట్లు అడుగుతున్నారని మధ్యవర్తులు చెబుతున్నమాట.. పిఠాపురం టౌన్ లో రోడ్డు ప్రక్కన భూముల ధర భారీగా ఉందట.. ఎకరం భూమి రూ.2 కోట్ల వరకు పలుకుతుండగా.. భూమి లోపలకి ఉంటే రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోందని చెబుతున్నారు.. అయితే, ఇదంతా ఇప్పుడు పెరిగిన ధరేనట.. ఎందుకంటే..? ఇంతకు ముందు రూ.50 లక్షల నుంచి కోటి. 25 లక్షల రూపాయలు దాటలేదని స్థానికులు చెబుతున్నారు.. జాతీయ రహదారి 216కి సమీపంలో ఉన్న భూములు ఎకరం రూ.3 కోట్లు, లోపలకి ఉన్నవి రూ. కోటిన్నర వరకు చెబుతున్నారట.. గతంలో నేషనల్ హై వే పై కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ధర పలికిందంటున్నారు..
Read Also: Hot Water Drinking : గోరువెచ్చని నీరు తాగడంవల్ల నిజంగా బరువును తగ్గవచ్చా.. అసలు నిజమేంటంటే..
మరోవైపు.. లేఅవుట్ లలో స్థలాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది అంటున్నారు రియల్టర్లు.. అగ్రిమెంట్లు తర్వాత అడ్వాన్సులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి పార్టీలు.. వారం రోజుల్లోనే రెట్టింపు ధర పలుకుతోందట గజం భూమి ధర.. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో అడ్వాన్స్ అవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. అందినకాడికి భూమి కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారట.. అధిక లాభాలు వస్తాయని పదిమంది చిన్న సన్నకారు రైతులు దగ్గర భూములు కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతున్నారట.. వరదలు వస్తే ఈ ప్రాంతం ముంపుకి గురవడంతో ఇప్పటి వరకు పెద్దగా లేని డిమాండ్, పవన్ కల్యాణ్ భూములు ఉన్నాయి కాబట్టి ముంపుకు శాశ్వత పరిష్కారం వస్తుందని స్థానిక రైతులు ఆశిస్తున్నారు.. మొత్తంగా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో.. పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాననే ప్రకటనతో రియల్ భూమ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా పిఠాపురం మారిపోయిందని చెబుతున్నారు.