NTV Telugu Site icon

Vande Bharat Sleeper: ట్రయల్ రన్‌కు సిద్ధమైన వందే భారత్ స్లీపర్.. ప్రయాణికులకు పండగే..!

Vande Bharat Sleeper

Vande Bharat Sleeper

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ ట్రైన్లు చైర్ కార్స్‌తో నడుస్తున్నాయి. అయితే.. త్వరలోనే స్లీపర్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. వందే భారత్ స్లీపర్‌లో ప్రయాణీకులు హాయిగా పడుకుని నిద్రపోతూ ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. అయితే.. ఈ రైలును త్వరలో పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం ముందు ట్రయల్‌ నిర్వహించనున్నారు. ఈ రైలు ట్రయల్ రన్ త్వరలో ప్రారంభం కానుంది.

Read Also: Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు

వందే భారత్ స్లీపర్ ఎప్పటి నుండి నడుస్తుందో రైల్వే శాఖ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీ-శ్రీనగర్ మధ్య నడుపనున్నట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. కాగా.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వందే భారత్‌ స్లీపర్‌కు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. వందేభారత్ చైర్ కార్‌తో ప్రస్తుతం 136 రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. వీటిలో 16 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు తమిళనాడు రాష్ట్రంలో నడుస్తున్నాయన్నారు. ఢిల్లీ-బనారస్ మధ్య వందే భారత్ రైలు 771 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. సుదూర, మధ్య దూర ప్రయాణాల కోసమని ప్లాన్ చేసిన వందే భారత్ స్లీపర్ రైళ్లలో.. ఆధునిక సౌకర్యాలు, ప్రయాణీకుల సౌకర్యాలతో అమర్చబడి ఉన్నాయని పేర్కొన్నారు.

స్లీపర్ వందే భారత్ రైలు ఫీచర్లు:
1- ఈ రైలులో ఆర్మర్ టెక్నాలజీని ఉపయోగించారు.
2- EN-45545 HL3 అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
3- క్రాష్‌వర్తీ, జెర్క్-ఫ్రీ సెమీ పర్మనెంట్ కప్లర్.. యాంటీ క్లైంబర్.
4- EN ప్రమాణాల ప్రకారం కార్బాడీ యొక్క క్రాష్‌వర్టీ డిజైన్.
5- శక్తి సామర్థ్యం కోసం రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్.
6- అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులు, రైలు మేనేజర్/లోకో పైలట్ మధ్య కమ్యూనికేషన్ కోసం ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ యూనిట్.
7- ప్రతి చివర డ్రైవింగ్ కోచ్‌లో పరిమితం చేయబడిన మొబిలిటీ (PRM) ఉన్న ప్రయాణీకులకు వసతి, అందుబాటులో ఉండే టాయిలెట్లు.
8- రైలులో కేంద్ర నియంత్రణలో ఉండే ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, విశాలమైన గ్యాంగ్‌వేలు.
9- పై బెర్త్‌కు సులభంగా ఎక్కేందుకు చక్కగా రూపొందించిన నిచ్చెన.
10- ప్రతి కోచ్‌లో సీసీ కెమెరాలు, ఏసీ, సెలూన్ లైటింగ్ మొదలైన సౌకర్యాలు.