NTV Telugu Site icon

TG Congress: కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతల రియాక్షన్..

Ktr Congress

Ktr Congress

కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్‌కి ఒకవైపు గోడ దెబ్బ, ఇంకో వైపు చెంప దెబ్బ పడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకొని కుంభకోణం లంభకోణం లేదని అంటావా..? అని దుయ్యబట్టారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు అంటున్నారు.. తాము బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా తలుపులు విరగొట్టి అరెస్టు చేయడం లేదని అన్నారు. కేటీఆర్ ఇప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు.. కేటీఆర్ చేస్తున్న దానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ తెలిపారు.

Read Also: Stock Market: వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రౌడీలతో కేటీఆర్ రాజకీయం చేస్తున్నారు.. అధికారులు, ఎమ్మెల్యేలు అందరిపైనా దాడులు చేసేది బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. దాడుల సంస్కృతిని బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది.. కేటీఆర్ సహా అవినీతి చేసిన వాళ్లంతా ఉండాల్సింది జైల్లో అని పేర్కొన్నారు. జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట రకరకాల మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అన్ని దొంగతనాలు ప్రజలకు తెలుస్తాయి.. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపారు. ప్రశ్నిస్తే అరెస్టులా అంటున్న బీఆర్ఎస్ నేతలు.. 10 ఏళ్లలో చేసింది ఏమిటి అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కోదండ రామ్, మందకృష్ణ మాదిగ, విమలక్క సహా ప్రజాస్వామ్యక వాదులు, ప్రతిపక్ష నేతలు మీద బీఆర్ఎస్ ఏం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. ప్రజలే దాడులు చేసే సంస్కృతిని బీఆర్ఎస్ నేతలు తెచ్చుకోవద్దని అద్దంకి దయాకర్ సూచించారు.

Read Also: PPF Scheme: బెస్ట్ పెట్టుబడి స్కీమ్.. రోజుకు రూ. 50 పొదుపు చేస్తే చాలు.. చేతికి రూ. 5 లక్షలు

Show comments