NTV Telugu Site icon

RCB VS KKR: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఘన విజయం సాధించిన కేకేఆర్

కేకేఆర్ టీం

కేకేఆర్ టీం

RCB VS KKR: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై కేకేఆర్ విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఒక్క రన్ తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింకు దిగిన కోహ్లీ 18 రన్లు చేసి.. హర్షిత్ రాణా చేతిలో ఔటయ్యాడు. డుప్లెసిస్(7) స్వల్ప స్టోర్ చేసి వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన పటిదార్(52), విల్ జాక్స్(55) లు చెలరేగారు. ఇద్దరూ సిక్సుల వర్షం కురిపిస్తూ ఆఫ్ సెంచరి పూర్తి చేసుకున్నారు. కోల్ కతా బౌలర్లు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. రసెల్ తన మొదటి ఓవర్ మొదటి బాల్ లోనే ఫాంలో ఉన్న జాక్స్ వికెట్ తీసుకుని పటిదార్, జాక్స్ మధ్య పాట్నర్ సిఫ్ ను బ్రేక్ చేశాడు. అనంతరం అదే ఓవర్ లో పటిదార్ వికెట్ కూడా తీసుకున్నాడు. అనంతరం గ్రీన్, ప్రభుదేశాయ్ రంగంలోకి దిగారు. లోమ్రోర్(4), గ్రీన్ (6)లు ఒకే ఓవర్లో నరైన్ చేతిలో ఔటయ్యారు. రంగంలోకి దిగిన దినేష్ కార్తిక్, ప్రభుదేశాయ్ మధ్య మంచి పాట్నర్షిప్ కొనసాగుతుండగా… ప్రభుదేశాయ్ హర్షిత్ రాణా ఓవర్లో క్యాచ్ ఔటయ్యాడు. ఇక ఆర్సీబీ టీం, ఫ్యాన్స్ అంతా డీకే మీద ఆశలు పెట్టుకున్నారు.
READ MORE: Yogi Adityanath: బాణాసంచా పేలినా పాకిస్తాన్ వివరణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది..
ఆఖరి ఓవర్లో బెంగళూరు 21 రన్లు చేయాల్సి ఉంది. ఓవర్ ను స్టార్క్ వేశాడు. మొదటి, మూడో, నాలుగో బాల్ ను కరణ్ శర్మ సిక్స్ వైపు మళ్లించాడు. రెండు బాల్ లకు 3 రన్లు చేయాల్సి ఉండగా.. కరణ్ శర్మ క్యాచ్ ఔటయ్యాడు. బరిలోకి దిగిన ఫెర్గుసన్ చేతిలో ఒకే బాల్ ఉంది. మూడు రన్ల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంది. స్టార్క్ తన ఓవర్ లో వేసిన చివరి బంతిని ఫెర్గుసన్ టచ్ చేసి ఒక్క పరుగు తీశారు. దీంతో కోల్ కతా ఒక్క పరుగు తేడాతో ఘన విజయం సాధించింది. టీం విజయం కోసం దినేష్ కార్తిక్ చివరి వరకు పోరాడారు.

అంపైర్లపై కోహ్లి ఆగ్రహం..
మ్యాచ్లో కింగ్ కోహ్లి అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్షిత్ బౌలింగ్లో మొదటి బాల్ ను ఎదుర్కొన్న కోహ్లీ హర్షిత్ చేతికే క్యాచ్ ఇచ్చాడు. నో బాల్ అంటూ రివ్యు తీసుకున్న కోహ్లీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించడంతో ఆవేశానికి గూరైన కోహ్లీ అంపైర్ పై అగ్రహానికి గురయ్యారు.