RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయవంతంగా ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ మొదటి నుంచే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్‌గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
మరోవైపు వన్ డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 4 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి కగిసో రబడా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 15 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ కాగా, కృనాల్ పాండ్య కూడా రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే 2 బంతుల్లో 1 పరుగు చేసి వెనుదిరిగాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం పట్టుదలతో ఆడి కేవలం 25 బంతుల్లోనే తన కెరీర్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 42 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ.. ఆర్సీబీకి రెండో సారి కప్ అందించాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
- Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
కోహ్లీ విశ్వరూపం..
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పదం “పరుగుల ఆకలి”. ఎన్ని రికార్డులు సృష్టించినా, ఎన్ని రికార్డులను బద్దలు కొట్టినా.. ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో నిరూపించుకోవాలనే ఒక కుర్రాడి లాంటి కసి, ఎనర్జీ కోహ్లీలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ఐపీఎల్లో ఇప్పటికే 65కు పైగా హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ.. తన కెరీర్లోనే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీని నమోదు చేయడానికి ఐపీఎల్ 2026 ఫైనల్ లాంటి ఒక పెద్ద వేదికను ఎంచుకున్నాడు.
అంచనాలను తలకిందులు చేస్తూ మెరుపు ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ వేగంగా ఆడుతూ ఉంటే, కోహ్లీ అతనికి సింగిల్స్ ఇస్తూ సపోర్ట్ ఇస్తాడని అందరూ భావించారు. కానీ మైదానంలో సీన్ రివర్స్ అయింది. కోహ్లీ మొదటి నుంచే గుజరాత్ బౌలర్లు కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్‌లపై విరుచుకుపడుతూ కేవలం 12 బంతుల్లోనే 35 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. పవర్‌ప్లే ముగిసిన తర్వాత గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ మైదానంలో కోహ్లీని స్లెడ్జింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. కోహ్లీ పూర్తిగా తన ఆటపైనే దృష్టి పెట్టి, అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వదిలేశాడు.
గాయాన్ని సైతం లెక్కచేయకుండా..
మ్యాచ్‌లో 10వ ఓవర్ సమయానికి కోహ్లీ క్రాంప్స్ తో ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. నొప్పితో బాధపడుతున్నా కూడా అతను ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మధ్యమధ్యలో వాటర్ బ్రేక్స్ తీసుకుంటూ ఆటను కొనసాగించాడు. చివరికి కేవలం 25 బంతుల్లోనే తన కెరీర్ బెస్ట్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఫిఫ్టీ పూర్తి చేసిన వెంటనే ఏమాత్రం సంబరాలు చేసుకోకుండా, ఇంకా పరుగుల వేట కొనసాగించాలనే కసితో డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ నీళ్లు పంపించమని సైగ చేశాడు. చిన్న విషయాలుగా అనిపించినా.. కట్టుబాటు, పోరాట పటిమ, అత్యుత్తమ మైండ్ సెట్ అంటే ఏంటో చూపించడానికి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఒక గొప్ప ఉదాహరణ. రాబోయే యువ క్రికెటర్లకు అతని ఆట ఒక అద్భుతమైన పాఠం.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!