RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs DC: ఢిల్లీ వేదికగా జరిగిన ఐపీఎల్మ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ పై భారీ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు RCB బౌలర్లు ధాటికి పూర్తిగా విఫలమైంది. 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు సహిల్ పరఖ్, కేఎల్ రాహుల్ త్వరగా ఔట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. ఆ తరువాత నితీష్ రాణా, సమీర్ రిజ్వి, ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా విఫలమయ్యారు. అభిషేక్ పోరెల్ (30) కొంత పోరాడగా, డేవిడ్ మిల్లర్ 19 పరుగులు చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు నిలబడలేకపోవడంతో చేతులెత్తేశారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజల్ వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసి ఢిల్లీని కుదేలు చేశారు. సుయాష్ శర్మ, కృణాల్ పాండ్య, రసిఖ్ సలామ్ తలో వికెట్ తీసి వారికి మద్దతు ఇచ్చారు.
Also Read
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా గెలుపును అందుకుంది. జేకబ్ బెథెల్ 20 పరుగులు చేసి ఔట్ అయినప్పటికీ, ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 23 నాటౌట్, దేవదత్ పడిక్కల్ (34 నాటౌట్ తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. బౌలింగ్‌లో స్పీడ్, తరువాత బ్యాటింగ్‌లో దూకుడు ఆటతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చూపించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో RCB రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
తాజావార్తలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
-
Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!