Vijay Mallya: “నాడు రూ. 450 కోట్లకు కొంటే నవ్వారు.. నేడు గర్వంగా ఉంది!”.. RCB అమ్మకంపై విజయ్ మాల్యా ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Mallya: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) చేతులు మారిన విషయం తెలిసిందే. లీగ్ ఆరంభం నుంచి ఆర్సీబీని నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్‌ఎల్) సంస్థ.. ఏకంగా రూ.16,706 కోట్ల ధరకు ఆర్సీబీని అమ్మేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్‌ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు కలిసి ఈ ఫ్రాంఛైజీని చేజిక్కించుకున్నాయి. ఆర్సీబీ పురుషులతో పాటు మహిళల జట్టును కూడా కలిపే ఈ నాలుగు సంస్థల కన్సార్షియం సొంతం చేసుకుంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ యజమాని విజయ్ మాల్యా, ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో జరిగిన అమ్మకంపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆర్‌సీబీ కొత్త యజమానులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. వారికి అంతా మంచే జరగాలని కోరుకున్నారు.
READ MORE: Peddi: అనుకున్నదే అయిందా? వెనక్కి తగ్గిన పెద్ది, కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
Also Read
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
ఆర్సీబీ (RCB) కొత్త యజమానులకు నా హృదయపూర్వక అభినందనలు. ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆర్సీబీ ఫ్రాంచైజీతో మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2008లో నేను ఈ ఫ్రాంచైజీని రూ.450 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు, చాలా మంది నన్ను చూసి నవ్వారు. అదొక పనికిరాని పెట్టుబడి అని విమర్శించారు. కానీ, ఆ నిర్ణయం వెనుక నా అసలు లక్ష్యం ‘రాయల్ ఛాలెంజ్’ బ్రాండ్‌ను నిర్మించడం. అందుకే దీనికి RCB అని పేరు పెట్టాను. నాడు నేను పెట్టిన రూ.450 కోట్ల పెట్టుబడి నేడు రూ.16,500 కోట్లకు పెరగడం చూడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. అప్పట్లో యువకుడైన విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం నా మధుర జ్ఞాపకాలలో ఒకటి. నేడు అతను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా ఎదిగాడు. ఆర్సీబీని ఆదరిస్తున్న అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. ‘బెంగళూరు సింహం’ అయిన ఆర్సీబీకి మీ మద్దతు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం” అని విజయ్ మాల్యా ట్వీట్‌లో పేర్కొన్నారు.
I would like to heartily congratulate the new owners of RCB. I wish them the very best and Godspeed with the most valuable IPL franchise. When I bought the franchise in 2008 for INR 450 crores, most people laughed at me and criticised my investment as a vanity project. Behind my…
— Vijay Mallya (@TheVijayMallya) March 26, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!