RBI New Rules On UPI: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం (DFS) సంయుక్తంగా గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో కొన్ని కొత్త డిజిటల్ పేమెంట్ ఫీచర్లను ప్రారంభించాయి. వీటితో దేశంలో లావాదేవీలు మరింత సులభం, సురక్షితం, సౌకర్యవంతంగా ఉంచుతూ అందరికీ అందుబాటులో ఉండేలా మారనున్నాయి. కొత్త డిజిటల్ పేమెంట్ ఫీచర్లలలో భాగంగా UPI మల్టీ సిగ్నేటరీ, UPI లైట్ ద్వారా హ్యాండ్స్-ఫ్రీ ట్రాన్సాక్షన్లు, ఆన్-డివైస్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్, ఆధార్ ఆధారిత ఫేస్ వెరిఫికేషన్, ఇంకా మైక్రో ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ వంటి ముఖ్యమైన ఫీచర్లను తీసుకవచ్చారు.
RBI డెప్యూటీ గవర్నర్ టి. రబీ శంకర్ UPI మల్టీ-సిగ్నేచరీ ఫీచర్‌ను ఆవిష్కరించారు. ఇది జాయింట్ అకౌంట్లు లేదా మల్టీ అప్రూవల్ అకౌంట్ల నుండి చెల్లింపులు చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా లావాదేవీలు అకౌంట్ లో ఉన్న అందరి ఆమోదం తర్వాత మాత్రమే అమలు అవుతాయి. ప్రతి ఖాతాదారు తనకు అనుకూలమైన ఏదైనా UPI యాప్ ఉపయోగించి లావాదేవీని అప్రూవ్ చేయవచ్చు. ఇది చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసి, పారదర్శకతను పెంచుతుంది.
Taliban: తాలిబాన్ మంత్రి భారత పర్యటన.. ఆఫ్ఘాన్ “జెండా”పై పంచాయతీ..
UPI Lite యూజర్లు ఇప్పుడు స్మార్ట్ గ్లాసెస్ ద్వారా హ్యాండ్స్ ఫ్రీ, లో వాల్యూ పేమెంట్స్ చేయగలరు. యూజర్ QR కోడ్‌ను స్కాన్ చేసి, వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా చెల్లింపు పూర్తవుతుంది. ఈ విధానంలో మొబైల్ లేదా పిన్ అవసరం లేదు. కేవలం “Look. Speak. Pay.” అనే సులభమైన పద్ధతితో లావాదేవీ పూర్తవుతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ ఫీచర్‌ను ప్రదర్శించింది. చిన్న మొత్తం, తరచుగా జరిగే లావాదేవీల కోసం రూపొందించిన ఈ వ్యవస్థ బ్యాంకింగ్ సిస్టమ్‌పై ఆధారపడకుండా వేగంగా పనిచేస్తుంది.
NPCI మరో కీలక ఫీచర్‌గా ఆన్-డివైస్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ (On-Device Biometric Authentication) ను తీసుకవచ్చింది. ఇది యూజర్‌కి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా, తన మొబైల్ ఫోన్ లేదా పరికరంలోని బిల్ట్ ఇన్ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీ సెన్సర్ ద్వారా లావాదేవీలను ఆథెంటికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు UPI పిన్ సెట్ లేదా రిసెట్ చేయగలరు. అలాగే UPI ద్వారా ATMలలో నగదు ఉపసంహరణ కూడా చేయగలరు. దీంతో డిజిటల్ చెల్లింపులు మరింత వేగంగా, సురక్షితంగా మారి, పిన్ ఎంట్రీల కష్టాన్ని తొలగిస్తాయి. ఈ కొత్త ఫీచర్లు భారత డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చి, “క్యాష్‌లెస్ ఇండియా” దిశగా తీసుకపోనున్నాయి.