NTV Telugu Site icon

RBI: ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంకులు మీకు రోజుకు రూ. 100 చెల్లింపు!

Rbi

Rbi

దాచుకోవడం కోసం, లోన్స్, ప్రభుత్వ పథకాలు ఇలా వివిధ అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దాదాపు బ్యాంకు సేవలన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. బ్యాంకుకు వెళ్లకుండానే పనులు చక్కబెట్టేస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఖాతాకు సంబంధించిన సమస్యలు, డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ పరిష్కారం కోసం బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు టెక్నికల్ సమస్య కారణంగా ఖాతాలో డబ్బు కట్ అయిపోయి రిఫండ్ అవడం లేట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఖాతాదారుల సమస్యలను పరిష్కరించడంలో బ్యాంకులు జాప్యం చేస్తుంటాయి.

Read Also: Eric Garcetti: భారతదేశం నా హృదయాన్ని దోచుకుంది.. అమెరికా రాయబారి..

దీనికి చెక్ పెట్టేందుకు బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఖాతాదారుల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించకుంటే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ జరిమానాను ఖాతాదారులకు పరిహారంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులకు బ్యాంకులు ఇకపై రోజుకు రూ. 100 చెల్లించనున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు కస్టమర్ ఫిర్యాదులను ఒక నెలలోపు పరిష్కరించాలి. ఆ లోపు సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ.100 జరిమానా విధిస్తామని ఆర్బీఐ కొత్త ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Rahul Gandhi: కెవెంటర్స్ స్టోర్‌లో కాఫీ చేసుకుని తాగిన రాహుల్‌గాంధీ.. వీడియో వైరల్

బ్యాంకులు కస్టమర్లకు త్వరితగతిన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాక కస్టమర్ల క్రెడిట్ సమాచారాన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు పొందినట్లైతే ఈ విషయాన్ని వారికి ఈ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకులు ఖాతాదారులకు లోన్ చెల్లించకుండా డీఫాల్ట్ గా ఉంటే ఈ విషయాన్ని 21 రోజుల్లో తెలియజేయాలి. అలా చేయకపోతే కస్టమర్లకు రోజుకు రూ. 100 పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ ఆదేశించింది. కాగా ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.

Show comments