NTV Telugu Site icon

REPO Rate: రెపోరేట్ తగ్గించిన ఆర్బీఐ..

Repo Rate

Repo Rate

REPO Rate: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ రోజు జరిగిన సమావేశంలో రెపో రటును 25 బేస్ పాయింట్స్ ను తగ్గించింది. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. తాజా తగ్గింపుతో రెపోరేటు 6.25%గా నిర్ణయించబడింది. 5 ఏళ్ల తర్వాత ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించింది. రెపోరేటు తగ్గింపు ప్రకటన సందర్భంగా గవర్నర్ మల్హోత్రా గ్లోబల్ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కొనసాగుతోందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పురోగతి కాస్తా ఆగిపోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.

Read Also: Rashmika Mandanna : దయ.. కరుణ అని వేదాలు వల్లిస్తున్న రష్మిక

రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు వద్ద రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు పొందుతాయి. దీని వల్ల బ్యాంకులు సాధారణ వినియోగదారులకు అందించే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంది. ముఖ్యంగా గృహరుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపవచ్చు. రెపోరేటు తగ్గింపు నేపథ్యంలో దేశీయ మార్కెట్‌ స్పందనపై ఆర్థిక రంగం దృష్టి సారించింది. రానున్న రోజుల్లో ఈ నిర్ణయం దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆసక్తికరంగా మారింది.