Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Rbi Cancels Paytm Payments Bank License Impact On Customers

Paytm Payments Bank: బిగ్‌షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?

Published Date :April 24, 2026 , 7:34 pm
By Burugadda Veerababu
Paytm Payments Bank: బిగ్‌షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తోందన్న కారణంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) బ్యాంకింగ్ లైసెన్స్‌ను ఆర్‌బీఐ అధికారికంగా రద్దు చేసింది. దీనివల్ల ఇకపై ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుండదు. నేటితో బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని ఆర్బీఐ పేర్కొంది.

అసలు ఏం జరిగింది..?

Also Read

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
  • Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
  • Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్‌గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!

చాలా కాలంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పనితీరుపై ఆర్‌బీఐ నిఘా పెట్టింది. బ్యాంకింగ్ నిబంధనలను పాటించకపోవడం, కస్టమర్ల వివరాల నమోదు (KYC)లో లోపాలు ఉండటం వంటి కారణాలతో గతంలోనే ఆర్‌బీఐ ఈ బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అయితే.. ఆర్‌బీఐ సూచించిన మార్పులను చేయడంలో బ్యాంక్ విఫలమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కస్టమర్లపై ప్రభావం ఏంటి..?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును కస్టమర్లు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. కానీ.. కొత్తగా డబ్బులు డిపాజిట్ చేయడానికి అనుమతి ఉండదు. మీ పేటీఎం వాలెట్ లేదా ఫాస్టాగ్‌లో ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్‌ను మీరు వాడుకోవచ్చు. అయితే, లైసెన్స్ రద్దు నేపథ్యంలో వీటిని రీఛార్జ్ చేయడం సాధ్యం కాదు.

సాధారణ పేటీఎం యాప్ (UPI సేవలు) యథావిధిగా పనిచేస్తుంది. ఎందుకంటే యూపీఐ సేవలను ఇతర బ్యాంకుల సహకారంతో పేటీఎం అందిస్తోంది. కేవలం ‘పేమెంట్స్ బ్యాంక్’ సేవలు మాత్రమే నిలిచిపోతాయి. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, కస్టమర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆర్‌బీఐ ఈ నిర్ణయం ద్వారా మరోసారి స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలోని నగదును వేరే బ్యాంకులకు మార్చుకోవడానికి అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Paytm FASTag news
  • Paytm Payments Bank license cancelled
  • Paytm wallet safety
  • PPBL license revoked
  • RBI action on Paytm

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions