తెలంగాణా చరిత్రను తెలిపే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఇటీవల తెలంగాణ చరిత్ర గురించి వచ్చిన సినిమా సూపర్ హిట్ అయ్యాయి.. రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ మూవీ రజకార్.. హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, తమిళ్ నటుడు విజయ్ తదితరులు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు..
ఈ మొదట విమర్శలు అందుకున్నా కూడా థియేటర్లలోకి వచ్చిన తర్వాత సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. తెలంగాణ విముక్తి పోరాటంలో ఎవరికీ తెలియని పరకాల జెండా ఉద్యమం, భైరాన్ పల్లి నరమేథం లాంటి సంఘటలను ఈ సినిమాలో చూపించారు. తెలంగాణకు స్వేచ్ఛ కల్పించడం కోసం నారాయణరెడ్డి, ఐలమ్మ, రాజన్న వంటి వారు చేసిన అసమాన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు.. కొందరికి నచ్చక పోయిన సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది..
ఈ సినిమా భారీ ధరకు ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.. త్వరలోనే ఓటీటిలోకి రాబోతుందని తెలుస్తుంది.. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 26 లేదా మే 3న రజాకార్ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఈ సినిమా ఓటీటీ గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుందని తెలుస్తుంది…