Site icon NTV Telugu

Rayapati Sambasiva Rao: నాకు టికెట్‌ ఇవ్వకపోయినా పర్వాలేదు..! కానీ.. రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

Rayapati Sambasiva Rao

Rayapati Sambasiva Rao

Rayapati Sambasiva Rao: గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాలపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు పోటీ చేయమంటే నరసరావుపేట నుంచి పోటీ చేస్తానన్న ఆయన.. నేనిప్పుడు పోటీకి సిద్ధం.. గతంలో డబ్బుల్లేక ఓడాను.. ఇప్పుడు డబ్బులున్నాయని పేర్కొన్నారు. అయినా, ఈసారి డబ్బుల్లేకున్నా.. టీడీపీకి వేవ్ వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నా తనయుడు రంగబాబుకు సీటిమ్మని కోరుతున్నాం. రంగబాబుకు సత్తెనపల్లి ఇస్తారా..? పెదకూరపాడు ఇస్తారా..? అనేది చంద్రబాబు ఇష్టం అన్నారు.. ఇక, మా తమ్ముడు కూతురు రాయపాటి శైలజకూ టిక్కెట్ అడుగుతున్నాం… వాళ్లిద్దరికీ టికెట్లు ఇస్తే.. నాకు లేకున్నా పర్వాలేదన్నారు..

అయితే, నరసరావుపేటకు లోకల్ వాళ్లే అభ్యర్థిగా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాయపాటి.. కడప నుంచి వచ్చే బీసీకి టిక్కెట్ ఎందుకివ్వాలి..? లోకల్ బీసీలు లేరా..? అని ప్రశ్నించారు. కడప నుంచి వచ్చి పోటీ చేస్తే నరసరావుపేటలో గెలవడం కష్టమన్న ఆయన.. నాకు ఇవ్వకుంటే వేరేవారికైనా టిక్కెట్ ఇవ్వండి.. కానీ, లోకల్ వాళ్లకే ఇవ్వాలన్నారు.. నేను ముసలోడినైన మాట వాస్తవమే.. కానీ, అన్ని చోట్లా తిరుగుతా అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కలిసే పని చేస్తాం.. వర్గాలు లేవని స్పష్టం చేశారు.. నేను ఏ ఇంఛార్జ్‌లకు వ్యతిరేకంగా.. వేరేవాళ్లను ప్రోత్సహించడంలేదన్నారు. ఏమైనా ఉంటే చంద్రబాబుకే చెబుతాను అన్నారు రాయపాటి.

ఇక, మాచర్ల బ్రహ్మానంద రెడ్డికి ఇస్తామంటున్నారు.. కచ్చితంగా గెలుస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు రాయపాటి.. గురజాలలో ఎలా ఉంటుందో తెలియదన్న ఆయన.. ఏదైనా కరెప్షన్ లేని వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వడం మంచిదన్నారు. కొత్తవాళ్లకు అని కాదు.. కరెప్షన్ లేని వ్యక్తులకు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కన్నాకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా గెలుస్తారు.. మేమంతా సపోర్ట్ చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నాతో రాజీ లేదు.. ఏం లేదు.. పార్టీ కోసం పని చేస్తామన్న ఆయన.. కన్నా పదేళ్లు నన్ను ఏడిపించాడు.. ఆ తర్వాత కోర్టులో రాజీ పడ్డారు.. కన్నా.. చంద్రబాబునూ ఏడిపించాడు.. కానీ, కొన్ని కారణాల వల్ల పార్టీలో చేరారు. ఏదేమైనా చంద్రబాబు మాటే మాకు వేదం అని పేర్కొన్నారు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు.

Exit mobile version