దీపావళి పండుగకు మందు గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగాయి. శుక్రవారం కేబినెట్ విస్తరణ అట్టహాసంగా జరిగింది. 26 మందితో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇందులో హర్ష్ సంఘవి కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయగా.. రివాబా జడేజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయాన్ని సాధించింది. మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాల్లో గెలుపొంది రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో జూమ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రివాబా జడేజా ఘనవిజయం సాధించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది.