ధాన్యం సేకరణ చాలా వేగంగా జరుగుతుందని తెలిపారు పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 7,152 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ చెప్పారని, ఇప్పటివరకు 6000 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. గత సీజన్ లో 4 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే.. ఈ సంవత్సరం ఇవాళ్టి వరకు 10 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు. అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం అయిందని, వరి ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. రైతులు ఇబ్బంది పడితే నాకు ఫోన్ చేశారు నేను నిన్న జనగామ జిల్లా కూనూర్ కు వెళ్ళాను కొనుగోలు కేంద్రం వద్ద కొంత ఇబ్బంది వచ్చిందని ఆయన వెల్లడించారు.
Also Read : MP Revenge Story: పదేళ్ల నాటి పగ.. పట్టపగలే ఆరుగురిని కాల్చి చంపారు
అక్కడ ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని నేను అక్కడకు స్వయంగా వెళ్లి కొనుగోలు చేసి లారీ ధాన్యం ఎక్కించాను అక్కడికక్కడే రశీదు ఇవ్వడం జరిగిందని, తేమ శాతం 17,18 కంటే ఎక్కువగా రావడం లేదు 17 కంటే ఒక్క శాతం ఎక్కువ వచ్చిన కొనుగోలు చేయాలని చెప్పారన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మాదేనని, ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి కూడా స్పష్టంగా చెప్పారన్నారు. ఎంత ధాన్యం వచ్చిన ధాన్యం పూర్తి అయ్యే వరకు కొనుగోలు చేస్తామని, గన్ని బ్యాగులు సరిపడా ఉన్నాయి…. టార్పాలిన్ కవర్లు కూడా ఇప్పటికే అందుబాటులో ఉంచామన్నారు. అకాల వర్షాలతో కొంత నష్టం వచ్చింది బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Minister KTR : బీఆర్‌ఎస్ అంటే భారత్ రైతు సమితి