INDvsAUS 2nd Test: అశ్విన్, జడేజా సూపర్ రికార్డులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా టీమిండియా స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ చరిత్రకెక్కగా.. టెస్టుల్లో 250 వికెట్ల క్లబ్లో చేరాడు జడ్డూ. ఈ క్రమంలోనే అశ్విన్ టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(111 వికెట్లు) తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.
ఆసీస్‌పై వంద వికెట్ల క్లబ్లో..
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి రోజు ఆటలో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కారేను డకౌట్ చేసి.. ఆసీస్‌పై వంద వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ జాబితాలో సమకాలీన క్రికెటర్లలో రవీంద్ర జడేజా(71) తప్ప అశ్విన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు ఇదిలా ఉంటే.. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దివంగత ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ 195 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
తొలి భారత ప్లేయర్‌గా జడేజా..
టెస్టుల్లో 250 వికెట్లు పడగొట్టిన ఎలైట్ బౌలర్ల జాబితాలో జడేజా చేరాడు. ఈ టెస్టులో ఖవాజాను ఔట్ చేసిన జడ్డూ.. ఈ ఫీట్ నమోదు చేశాడు. దీంతో పాటు మరిన్ని రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో 250 వికెట్ల మార్కును అందుకున్న ఎనిమిదో భారత బౌలర్‌గా జడ్డూ నిలిచాడు. ఈ జాబితాలో కుంబ్లే, అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ , జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, బిషన్ సింగ్ బేడీ ఉన్నారు. అదే విధంగా.. టెస్టుల్లో 2500 పరుగులతో పాటు 250 వికెట్లు సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా జడేజా గుర్తింపు సాధించాడు. ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో అనిల్ కుంబ్లే, అశ్విన్, కపిల్ దేవ్ జడ్డూ కంటే ముందున్నారు. ఇక టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 2500 రన్స్‌తో పాటు 250 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా జడేజా రికార్డు క్రియేట్ చేశాడు. జడేజా 62 టెస్టుల్లోనే ఈ ఫీట్ నమోదు చేశాడు. అయితే, ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో ఈ రికార్డు సాధించిన జాబితాలో జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ఇంగ్లాండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్ ఉన్నాడు. బోథమ్ ఈ రికార్డును కేవలం 55 టెస్టుల్లోనే సాధించడం విశేషం.
Also Read: Google Layoff: భారతదేశంలో గూగుల్ లేఆఫ్స్.. 450 ఉద్యోగుల తొలగింపు..
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!