Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Ravichandran Ashwin Ravindra Jadeja Records Against Australia Delhi Test

INDvsAUS 2nd Test: అశ్విన్, జడేజా సూపర్ రికార్డులు!

NTV Telugu Twitter
Published Date :February 17, 2023 , 3:32 pm
By Nishanth Munjala
INDvsAUS 2nd Test: అశ్విన్, జడేజా సూపర్ రికార్డులు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా టీమిండియా స్టార్‌ స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ చరిత్రకెక్కగా.. టెస్టుల్లో 250 వికెట్ల క్లబ్‌లో చేరాడు జడ్డూ. ఈ క్రమంలోనే అశ్విన్ టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే(111 వికెట్లు) తర్వాత ఈ ఫీట్‌ నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.

ఆసీస్‌పై వంద వికెట్ల క్లబ్‌లో..

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా తొలి రోజు ఆటలో ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలెక్స్‌ కారేను డకౌట్‌ చేసి.. ఆసీస్‌పై వంద వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ జాబితాలో సమకాలీన క్రికెటర్లలో రవీంద్ర జడేజా(71) తప్ప అశ్విన్‌ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు ఇదిలా ఉంటే.. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దివంగత ఆసీస్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ 195 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

తొలి భారత ప్లేయర్‌గా జడేజా..

టెస్టుల్లో 250 వికెట్లు పడగొట్టిన ఎలైట్ బౌలర్ల జాబితాలో జడేజా చేరాడు. ఈ టెస్టులో ఖవాజాను ఔట్‌ చేసిన జడ్డూ.. ఈ ఫీట్‌ నమోదు చేశాడు. దీంతో పాటు మరిన్ని రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో 250 వికెట్ల మార్కును అందుకున్న ఎనిమిదో భారత బౌలర్‌గా జడ్డూ నిలిచాడు. ఈ జాబితాలో కుంబ్లే, అశ్విన్‌, కపిల్‌ దేవ్‌, హర్భజన్ , జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, బిషన్ సింగ్ బేడీ ఉన్నారు. అదే విధంగా.. టెస్టు‍ల్లో 2500 పరుగులతో పాటు 250 వికెట్లు సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా జడేజా గుర్తింపు సాధించాడు. ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో అనిల్‌ కుంబ్లే, అశ్విన్, కపిల్‌ దేవ్‌ జడ్డూ కంటే ముందున్నారు. ఇక టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2500 రన్స్‌తో పాటు 250 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా జడేజా రికార్డు క్రియేట్ చేశాడు. జడేజా 62 టెస్టుల్లోనే ఈ ఫీట్‌ నమోదు చేశాడు. అయితే, ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించిన జాబితాలో జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ఇంగ్లాండ్‌ దిగ్గజం ఇయాన్ బోథమ్ ఉన్నాడు. బోథమ్ ఈ రికార్డును కేవలం 55 టెస్టుల్లోనే సాధించడం విశేషం.

Also Read: Google Layoff: భారతదేశంలో గూగుల్ లేఆఫ్స్.. 450 ఉద్యోగుల తొలగింపు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashwin Record Australia
  • India vs Australia 2nd Test
  • Jadeja record 250 wickets
  • Ravichandran Ashwin Record
  • Ravindra Jadeja record

తాజావార్తలు

  • Off The Record: ఏపీ బీజేపీ పాత ముద్ర చెరిపేయడానికి తంటాలు పడుతోందా?

  • PBKS vs RCB : ఆర్సీబీ బౌలర్ల విజృంభణ.. పంజాబ్ బ్యాటర్లు కుదేలు…

  • Chiranjeevi : గద్దర్ అవార్డుల విజేతలకు కంగ్రాట్స్.. చిరంజీవి ట్వీట్

  • Karnataka: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో ఏం రాసిందంటే..!

  • Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్‌ మంజూరు

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions