R.Ashwin: ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టులోకి.. వరల్డ్ కప్లో ఛాన్స్ దొరుకుతుందా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. అయితే ఈ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ టీమిండియా వన్డే జట్టులోకి వచ్చాడు. మరోవైపు ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు కూడా పెరిగాయి. అయితే ఈ సిరీస్‌లోని మొదటి 2 మ్యాచ్‌లలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. తొలి 2 మ్యాచ్‌ల్లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. దీంతో పాటు విరాట్ కోహ్లికి కూడా విశ్రాంతి ఇచ్చారు.
Read Also: Big Breaking: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
Also Read
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
అయితే ఆస్ట్రేలియా సిరీస్‌లో రీఎంట్రీ ఇస్తుండటంతో రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రపంచకప్ లో ఛాన్స్ ఇవ్వనున్నట్లు సంకేతాలు తెలుస్తున్నాయి. అయితే అశ్విన్ ప్రపంచకప్ జట్టులోకి రావడం అంత సులువు కాదు. ప్రపంచకప్ జట్టులోకి రావాలంటే ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చూపించాలి. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ లో కూడా అశ్విన్ కు చోటు దక్కలేదు. రవిచంద్రన్ అశ్విన్ ఆఫ్ స్పిన్నర్ బౌలర్ కాగా.. ఎడమ చేతి బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్లపై అశ్విన్ వికెట్ టేకింగ్ ఎంపికగా నిరూపించుకోగలడు. అంతేకాకుండా తన బ్యాటింగ్‌తో జట్టుకు సహకారం అందించగలడు.
Read Also: Health Bulletin: ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల.. ఆరా తీసిన సీఎం..
రవిచంద్రన్ అశ్విన్ వన్డే కెరీర్ గణాంకాలను పరిశీలిస్తే.. ఇప్పటి వరకు 113 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అశ్విన్ 151 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్‌లో ఎకానమీ 4.94 కాగా.. స్ట్రయిక్ రేట్ 33.5. ఉంది. వన్డే ఫార్మాట్‌లో 25 పరుగులకు 4 వికెట్లు పడగొట్టడం బెస్ట్ ఫిగర్ ఉంది. అంతేకాకుండా.. అశ్విన్ వన్డే మ్యాచ్‌లలో 86.96 స్ట్రైక్ రేట్, 16.44 సగటుతో 707 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!