Site icon NTV Telugu

Ravichandran Ashwin: వందో టెస్టు నాకే కాదు.. మా కుటుంబానికీ ఎంతో స్పెష‌ల్‌

Ashwin

Ashwin

భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ లో ఐదో మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియా లెజెండ‌రీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఎంతో ప్రత్యేకం. త‌న వందో టెస్టుపై తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రయాణం త‌న‌కు ఎంతో ప్రత్యేక‌మ‌ని చెప్పుకొచ్చాడు. గ‌మ్యం కంటే ఎక్కువ అని అశ్విన్ అన్నాడు.

Read Also: Instagram: నిలిచిపోయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు..

వందో టెస్టు నాకే కాదు.. మా కుటుంబానికీ ఎంతో స్పెషల్.. నా త‌ల్లిదండ్రులు, భార్య, పిల్లలు కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ లో తాను ఏం చేశానో తన తండ్రి ఇప్పటికీ 40 మందికి స‌మాధానం చెప్పగ‌ల‌రు అని అన్నాడు. మరోవైపు.. మ్యాచ్ ధర్మశాలలో జరుగుతుంది కావున.. అక్కడి వేదిక గురించి స్పందించాడు. 21ఏళ్ల క్రితం ఈ వేదిక‌పై అండ‌ర్‌-19 క్రికెట్ ఆడాన‌ని, చాలా చ‌ల్లగా ఉండే ప్రదేశ‌ం.. కుదురుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని అశ్విన్ తెలిపాడు.

Read Also: Bihar: బీహార్‌లో బీజేపీ-ఆర్జేడీ సీట్ల సర్దుబాటు.. నితీష్‌కు ఎన్ని సీట్లంటే!

ఇటీవలే టెస్టుల్లో అశ్విన్‌ 500 వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇప్పుడు వందో టెస్టు ఆడుతున్న తొలి తమిళనాడు క్రికెటర్‌, 14వ భారత ఆటడాడిగా కూడా ఘనత సాధించనున్నాడు. ఇకపోతే.. అశ్విన్ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేయగా.. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. 23.91 సగటుతో వికెట్లు పడగొట్టాడు.

Exit mobile version