Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravichandran Ashwin: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లూ గెలిచినప్పటికీ, పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన మాత్రం నిరాశపరిచింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన భువి, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి, ఓవర్‌కు 11.58 పరుగుల సగటుతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై తాజాగా స్పందించిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, గౌతమ్ గంభీర్-శ్రేయస్ అయ్యర్ల నాయకత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ చివరి రెండు మ్యాచుల్లో ప్లేయర్ల రొటేషన్ పద్ధతిని పాటిస్తే భువనేశ్వర్ కుమార్‌పై వేటు పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
తన యూట్యూబ్ ఛానెల్లో అశ్విన్ మాట్లాడుతూ… భువి బౌలింగ్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే, అతని స్థానంలో జట్టు యాజమాన్యం ఒక స్పిన్నర్నో లేదా యంగ్ పేసర్ మయాంక్ యాదవ్నో తుది జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపాడు. న్యూజిలాండ్ జట్టు ఆడుతున్న తీరులోనే భారత్ కూడా ఆటగాళ్లను మార్చే అవకాశం ఉందన్నాడు. అయితే మొదటి రెండు మ్యాచ్‌లు పెద్ద గ్రౌండ్లలో జరిగాయని, అక్కడ స్పిన్నర్లను ఉపయోగించుకునే వెసులుబాటు ఉండేదని వివరించాడు. మూడో టీ20 విషయానికొస్తే న్యూజిలాండ్ స్పిన్నర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని గుర్తుచేశాడు. రాబోయే చివరి రెండు టీ20 మ్యాచ్‌లు జరిగే మైదానాలు మరింత చిన్నవిగా ఉంటాయని, అలాంటి చోట స్పిన్నర్లు ఎంతవరకు రానిస్తారో ఖచ్చితంగా చెప్పలేమని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
Also Read
- AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
- Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
ఈ సిరీస్‌లో మొదటి టీ20 ఆడిన మయాంక్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్‌ల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రిన్స్ యాదవ్ కోసం మయాంక్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక ప్రిన్స్ యాదవ్ గత రెండు మ్యాచ్‌ల్లో ఆశించినంత స్థిరమైన ప్రదర్శన చేయలేకపోయాడు. మరోవైపు స్టార్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇప్పటివరకు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. భారత్ ఇప్పటికే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు స్పిన్నర్లకు ఆడే అవకాశం దక్కవచ్చు. నిజానికి ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుతంగా రాణించడంతోనే 36 ఏళ్ల భువనేశ్వర్‌కు చాలా కాలం తర్వాత టీమిండియాలో మళ్లీ చోటు లభించింది. కానీ తీరా భారత జెర్సీ ధరించాక మాత్రం ఆయన తన పాత ఫామ్‌ను అందుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
-
Horoscope Today: గురువారం దిన ఫలాలు.. ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఆ రాశుల వారికి గుడ్‌న్యూస్!
-
India-US Defence Talks: భారత్-అమెరికా రక్షణ ఒప్పందంపై కీలక సమీక్ష.. ఉగ్రవాద దేశాలకు వార్నింగ్
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!