NTV Telugu Site icon

Ravichandran Ashwin In India: చెన్నై చేరుకున్న అశ్విన్.. భారీగా స్వాగతం పలికిన అభిమానులు

Aswin

Aswin

Ravichandran Ashwin In India: భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియా, ఆస్ట్రేలియా గబ్బా టెస్ట్ డ్రా తర్వాత అతను ఈ విషయాన్ని తెలియచేసాడు. 38 ఏళ్ల అతను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన తర్వాత మరుసటి నేడు ( గురువారం) భారత్ కు చేరుకున్నాడు. గురువారం చెన్నైలోని ఇంటికి చేరుకున్న ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అశ్విన్ ఇంటికి చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అశ్విన్ ఇంటికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో జనం అక్కడకు చేరుకున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆయన రాగానే బ్యాండ్ వాయించారు. అశ్విన్ పై పూలవర్షం కురిపించారు. ఆయనకు పూల మాలలు కూడా వేసి నివాళులర్పించారు. అశ్విన్ మొదట తన తండ్రిని కలిశాడు. తండ్రి అతన్ని కౌగిలించుకుని వీపు మీద తట్టాడు. ఆ తర్వాత తన తల్లిని కలిశాడు. కొడుకుని కౌగిలించుకోగానే తల్లి ఆనంద పరవశం పొందింది. ఆ తర్వాత అశ్విన్ కొందరికి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు.

Also Read: Realme Narzo 70 Turbo 5G: అదిరిపోయే ఫిచర్ల మొబైల్‌పై భారీ ఆఫర్ ప్రకటించిన రియల్‌మీ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆస్ట్రేలియాలో భారత్ ఇంకా రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైనప్పటికీ, అతను ఐపీఎల్‌తో సహా క్లబ్ క్రికెట్‌లో కొనసాగనున్నాడు. అతను IPL 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడనున్నాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్. 106 టెస్టులాడి 537 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో 619 వికెట్లు తీసిన మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అతని కంటే ముందున్నాడు. అశ్విన్ 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 72 వికెట్లు తీశాడు.

Also Read: Poco C75: తక్కువ ధరకే 50MP కెమెరా, 5160mAh బ్యాటరీ.. నేటి నుంచే అమ్మకాలు షురూ..

Show comments