Site icon NTV Telugu

Ravi Teja : రవితేజ బర్త్ డే స్పెషల్.. ఇరుముడితో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడా?

Ravaiteja

Ravaiteja

మాస్ మహారాజా చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో త్రినాథరావు డైరెక్షన్ లో వచ్చిన ధమాకాతో చివరి సారిగా హిట్ కొట్టాడు రవితేజ. ఆ ఈ సినిమాతో తొలిసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. కానీ ఆ తర్వాత రావణాసుర, టైగర నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ కొట్టాడు. ధమాకా ముంది కూడా రవితేజ కు చెప్పుకోదగ్గ హిట్ లేవు. ఒకానొక టైమ్ లో స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేసిన రవితేజ ఇప్పుడు హిట్ కొట్టడమే గగనం అనే సిచుయేషన్. అటు ఫ్యాన్స్ కూడా తమ హీరో ఎప్పుడు హిట్ కొడతాడని  హీరోగా దర్శకుడు శివనిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read : Spirit : రెబల్ స్టార్ స్పిరిట్ లో ప్రభాస్ కు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్?

RT77 పేరుతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్‌లో మంచి అంచనాలు ఏర్పరుచుకుంది. ఈ సినిమాను పాన్-ఇండియా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర మేకర్స్ ఈ చిత్రం టైటిల్‌ను మరియు ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఇరుముడి అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇరుముడి అంటే సనాతన ధర్మంలోని భక్తుడి పవిత్రమైన అర్చన.  అలాగే భగవాన్ అయ్యప్పకు అంకితం చేసిన సమర్పణ. తాజాగా రిలీజ్ చేసిన రవితేజ సినిమా ఫస్ట్ లుక్‌లో పవిత్రమైన అయ్యప్ప మాల ధరిస్తూ, భక్తులతో నిండిన వేడుకల ప్రాసెషన్‌లో ఉత్సాహభరితమైన మూడ్‌లో కనిపిస్తున్నాడు రవితేజ. అలాగే ఈ సినిమా తండ్రి – కూతుళ్ళ మధ్య జరిగిన ఓ ఎమోషనల్ స్టోరీ అని తెలుస్తోంది. తమిల్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. వరుస ప్లాపులకు భర్త మహాశయులతో బ్రేక్ ఇచ్చిన రవితేజ ‘ఇరుముడి’ తో బ్లాక్ బస్టర్ కొట్టాలని మరొకసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు మాస్ మహారాజ రవితేజ.

Exit mobile version