Raviteja : ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న రవితేజ.. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ లో ఆఫర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యారు.. వరుస గా బిగ్గెస్ట్ ఆఫర్స్ అందుకుంటున్నాడు.. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘వార్’సినిమాకు సీక్వెల్‌గా అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ‘వార్ 2’ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనుంది.. ‘వార్ 2’ సినిమా తో ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బాట లోనే మాస్ మహారాజా రవితేజ కూడా బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమౌతున్నారు.ఇటివలే ‘టైగర్ నాగేశ్వరరావు’ పాన్ ఇండియా సినిమా చేశారు రవితేజ. అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు రవితేజ. హిందీ వెర్షన్ కు స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు.
అయితే ఈ కష్టం వృధా పోలేదు. ఇప్పుడు రవితేజ కు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడో భారీ మల్టీస్టారర్ లో నటించే ఆఫర్ రవితేజని వెతుక్కుంటూ వచ్చింది.ఓ అగ్ర నిర్మాణ సంస్థ రవితేజతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ చేయడానికి రవితేజ సుముఖం గా వున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన రానున్నట్లు సమాచారం.ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మూవీ ఈగల్.కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుక గా విడుదల అవుతుంది.ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ ఈగల్ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.అలాగే రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమౌతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.ఈ సినిమా కూడా కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందిన కథాంశంతో తెరకెక్కుతుంది..
Also Read
- UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
తాజావార్తలు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!