Site icon NTV Telugu

Ravi Teja: ఇరుముడి సెట్స్‌లో మాస్ మహారాజా బర్త్‌డే బ్లాస్ట్..

Ravi Teja Irumudi

Ravi Teja Irumudi

Ravi Teja: డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సినిమా “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మాస్ మహారాజా తన కొత్త సినిమాపై దృష్టి పెట్టారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ 77వ సినిమాను రూపొందుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుంది. మేకర్స్ ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

READ ALSO: T20 World Cup: రంగంలోకి పాకిస్తాన్ ప్రధాని.. టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా లేదా..?

ఈ సినిమా షూటింగ్ సెట్‌లో రవితేజ బర్త్‌డే సెలబ్రేషన్‌ను చిత్రం బృందం ఘనంగా నిర్వహించింది. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో డైరెక్టర్ శివనిర్వాణ, మాస్ మహారాజా రవితేజతో కేక్ కట్ చేయించారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నలుపు దుస్తులు, ఇరుముడి పట్టుకొని ఉన్న రవితేజ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమా తండ్రి-కూతురి మధ్య భక్తి, ప్రయాణం చుట్టూ తిరిగే కథ అని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇరుముడి సెట్స్‌లో నిర్వహించిన రవితేజ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

READ ALSO: Xi Mingze: డ్రాగన్ సింహాసనంపై జిన్‌పింగ్ కుమార్తె?

Exit mobile version