NTV Telugu Site icon

Ravi Shankar Prasad: అంబేడ్కర్‌ను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చిందేవరు?

Ravi Shankar Prasad

Ravi Shankar Prasad

గత కొన్ని రోజులుగా బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేడ్కర్‌ పేరుతో రాజకీయ పోరాటం సాగుతోంది. పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఎస్పీ సహా పలు రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ దీనిని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసుకుంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దళితుల ఆవాసాలను సందర్శించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ అంబేడ్కర్‌ను అవమానిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.

READ MORE: Seethakka: పుష్ప 2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్

తాజాగా.. బీజేపీ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “కాంగ్రెస్‌ గతంలో రాసిన లేఖను ప్రజల ముందుంచుతాం. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను ఎక్కువగా అవమానించింది కాంగ్రెస్సే. జవహర్ లాల్ నెహ్రూ ఎన్నికల్లో ఆయనను ఓడించడంతో పాటు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు.1952 ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుంచి అంబేడ్కర్ ఓడిపోయారు. ఆయనపై నారాయణ్ సదోబా కజ్రోల్కర్ విజయం సాధించారు. నెహ్రూ ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా ప్రచారానికి కూడా వెళ్లారు. ఇది మాత్రమే కాదు.. అంబేడ్కర్‌ను ఓడించిన అదే నారాయణ్ సదోబా కజ్రోల్కర్‌కు 1970లో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది.” అని తెలిపారు.

READ MORE: IND vs AUS: బాక్సింగ్ డే టెస్టులో భారత్ రికార్డు ఎలా ఉందంటే..? కోహ్లీ, బుమ్రా స్పెషల్

అమిత్ షా అంబేడ్కర్ గురించి ఏమన్నారు?
ఇటీవల పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. అందులో భాగంగా “అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్.. అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అలా పదే పదే అంబేడ్కర్‌ పేరు స్మరించే బదులు ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడు జన్మల దాకా స్వర్గప్రాప్తి లభించేది” అని అమిత్ షా అన్నారు. దీంతో గందరగోళం ఏర్పడింది. పార్లమెంటు కార్యకలాపాలను వాయిదా వేయాల్సి వచ్చింది.

Show comments