NTV Telugu Site icon

Ravi Bishnoi Catch: రవి బిష్ణోయ్‌ స్టన్నింగ్‌ రిటర్న్‌ క్యాచ్‌.. చూస్తే మతిపోవాల్సిందే!

Ravi Bishnoi Catch

Ravi Bishnoi Catch

Ravi Bishnoi Sensational Catch Best In IPL Ever: ఐపీఎల్‌ 2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్‌ రిటర్న్‌ క్యాచ్‌తో గుజరాత్‌ టైటాన్స్ స్టార్‌ ప్లేయర్ కేన్‌ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు. విలియమ్సన్‌ కొట్టిన షాట్‌ను బిష్ణోయ్‌ అమాంతం గాల్లో ఎగిరి ఒంటి చేత్తో బంతిని పట్టుకున్నాడు. దీంతో సహచరులతో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్‌ టైటాన్స్ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ను రవి బిష్ణోయ్‌ వేసాడు. రెండో బంతిని ఆఫ్‌ స్టంప్‌ వెలుపుల సంధించగా.. కేన్‌ విలియమ్సన్‌ స్టైట్‌గా షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేవగా.. బిష్ణోయ్‌ తన కుడి వైపునకు జంప్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌తో రిటర్న్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన కేన్‌ మామ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. ఒక్క పరుగు మాత్రమే చేసిన కేన్‌ నిరాశతో మైదానాన్ని వీడాడు. లక్నో ప్లేయర్స్ బిష్ణోయ్‌ని ప్రశంసించారు. బిష్ణోయ్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటి అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Iran: ఇజ్రాయిల్ ఎంబసీలు ఇక ఎంత మాత్రం సేఫ్ కావు.. ఇరాన్ వార్నింగ్..

ఈ మ్యాచ్‌లో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. స్టాయినిస్‌ (58; 43 బంతుల్లో 4×4, 2×6), పూరన్‌ (32 నాటౌట్‌; 22 బంతుల్లో 3×6) రాణించారు. గుజరాత్‌ బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ (2/22), దర్శన్‌ నాల్కండే (2/22) ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 18.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్‌ అయింది. సాయి సుదర్శన్‌ (31; 23 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌. యశ్‌ ఠాకూర్‌ (5/30) చెలరేగాడు.