Site icon NTV Telugu

Toxic : ‘టాక్సిక్’ కోసం రవి బస్రూర్ మ్యూజికల్ మ్యాజిక్..

Ravi Basrur

Ravi Basrur

 రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. ఈ సినిమా టీజర్ మరియు పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న రవి బస్రూర్ సినిమా సౌండ్‌ట్రాక్ గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంతో ఆయన మరోసారి తన మ్యూజికల్ మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read : Varanasi : అంటార్కిటికాలో ‘వారణాసి’.. ప్రియాంక చోప్రా నటనపై మహేశ్ షాకింగ్ కామెంట్స్

1980 మరియు 90వ దశకంలోని బాలీవుడ్ సంగీతాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘టాక్సిక్’ ఒక విందు లాంటిది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘లైవ్ ఆర్కెస్ట్రా’తో పాటలను రికార్డ్ చేశాం. కేవలం డిజిటల్ సౌండ్స్‌కు పరిమితం కాకుండా, వింటేజ్ ఫీల్ వచ్చేలా రెట్రో ప్రభావంతో పాటు ఆధునిక హంగులను అద్ది సరికొత్త సౌండ్‌ను రూపొందించాము. ఈ పాత మరియు కొత్త కలయిక ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. గత నాలుగేళ్లుగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ ప్రాజెక్ట్ కోసం నిరంతరం శ్రమిస్తోంది. మ్యూజిక్ మేకింగ్‌లో గీతూ ఎంతో కేర్ తీసుకుంది. ఈ  సినిమాలోని విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఆ విజువల్స్‌కు అనుగుణంగానే మ్యూజిక్ రూపుదిద్దుకుంది. దర్శకురాలికి తన సినిమాపై పూర్తి అవగాహన ఉంది.ఆమె సూచనలు సంగీతానికి మరింత బలాన్ని ఇచ్చాయి” అని అన్నారు. మార్చి 19, 2026న విడుదల కానున్న ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ అందించే నేపథ్య సంగీతం (BGM) ‘టాక్సిక్’ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version