Site icon NTV Telugu

Ravela Kishore : ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.. అందుకే బీఆర్‌ఎస్‌లోకి

Ravela Kishore Babu

Ravela Kishore Babu

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఏపీకి చెందిన నేతలు చేరనున్నారు. మాజీమంత్రి రావెల కిషోర్ బాబుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌లతో పాటు మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధి కూడా నేటి సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు. కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు నన్ను బాగా ఆకర్షించాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని ఆయన విమర్శించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నారు రావెల.
Also Read : Hyderabad Metro : మరో 45 రోజుల పాటు హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పెంపు

చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదని, ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ నిర్మాణం చేస్తామన్నారు. తోట చంద్రశేఖర్ నేను మంచి స్నేహితులం.. గతంలో ఇద్దరం ఒకే పార్టీలో కలిసి పని చేశాం.. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ చేసినట్లే ఇప్పుడు బీజేపీ కూడా ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీ పేరుతో రాజకీయ పార్టీలను అణిచివేయలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బీజేపీకి దేశ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చివరి శ్వాస వరకు కేసీఆర్ తోనే ఉంటా.. బీఆర్‌ఎస్ లో కొనసాగుతానని ఆయన తెలిపారు.
Also Read : NIMS : నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ వైద్యుల భర్తీ నోటిఫికేషన్

Exit mobile version