Rashtrapati Bhavan: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. ఇక, వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ-ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సైతం చేయనుండటంతో నేటి ( జూన్ 5) నుంచి ఈ నెల 9వ తేదీ వరకు సాధారణ ప్రజానీకాన్ని రాష్ట్రపతి భవన్‌లోకి అనుమతి ఇవ్వడం లేదని మంగళవారం ఓ ప్రకటన విడుల చేసింది.
Read Also: NEET Result 2024: నీట్ లో మెరిసిన తెలుగు తేజాలు.. ఏపీలో నలుగురికి ఒకటో ర్యాంక్
కాగా, నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ కాబోతుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ప్రధాని మోడీ చర్చించనున్నారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలంటూ రాష్ట్రపతిని బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి కోరనుంది. అటుపై ప్రధాని మోడీ సారథ్యంలో కొత్త క్యాబినెట్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీంతో రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు చేస్తుండటంతో సామాన్య ప్రజలకు అనుమతిని నిరాకరించారు.
