Site icon NTV Telugu

Rashmika-Vijay : రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్..

Rashmika, Vijay Devarakonda Marrage

Rashmika, Vijay Devarakonda Marrage

టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం కొనసాగుతూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ స్టార్ జంట పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, అక్టోబర్‌లోనే వీరిద్దరి నిశ్చితార్థం గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని సినీ వర్గాల్లో టాక్ వినిపించగా.. రష్మిక చేతి రింగ్ తో చెప్పకనే చెప్పేసింది. ఇక ఇప్పుడు రాజస్థాన్‌లోని అందమైన ఉదయపూర్‌లో, కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుందనే వార్త అభిమానులను మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది.

Also Read : Spirit : ప్రభాస్ ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!

అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గానీ, రష్మిక మందన్న గానీ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. వీరిద్దరూ కలిసి సినిమాలు చేయడం, పబ్లిక్ ఈవెంట్స్‌లో కనిపించడం, ఒకరిపై ఒకరు ప్రత్యేక శ్రద్ధ చూపించడం వంటివి డేటింగ్ వార్తలకు బలం చేకూర్చాయి. అయినప్పటికీ, పెళ్లి విషయంపై మాత్రం ఈ జంట మౌనం పాటిస్తోంది. గతంలో కూడా ఇలాంటి పెళ్లి డేట్ వార్తలు చాలాసార్లు వచ్చి, అవన్నీ రూమర్ల గానే మిగిలిపోయాయి. కాబట్టి, ఈసారి ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మలేము.

Exit mobile version