Site icon NTV Telugu

Rashmika : దెయ్యం సినిమాలో నేషనల్ క్రష్..

Teja Sajja,'mirai',daggubati Rana,

Teja Sajja,'mirai',daggubati Rana,

నేషనల్ క్రష్ రష్మిక.. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటన్న ఈ ముద్దుగుమ్మ అన్నీ భాషలనూ కవర్‌ చేసేస్తూ.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ఇటీవలే ‘ఛావా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ‘కుబేర’లో ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. దీంతోపాటు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటిస్తోంది. ఇక తాజాగా మరో ఆసక్తికరమైన సినిమా కూడా ఓకే చేసింది రష్మిక. అదె ‘థామా’. ఆసక్తికరమైన మూవీ అని ఎందుకు అన్నాను అంటే రష్మిక నటిస్తున్న తొలి హారర్‌ కామెడీ మూవీ ఇది.  ఆదిత్య సర్ఫోత్థార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ మూవీలో రష్మిక పాత్ర గురించి బాలీవుడ్‌ మీడియాలో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నా. ఎంటీ అంటే స్టార్ హీరోయిన్ ఇలా దెయ్యంలా నటించడం ఏంటి అని.. రిస్క్ చేస్తుంది అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. అయితే తాజాగా రష్మిక ఈ మాటలపై స్పందించింది..

Also Read: Lenin : ఎవరూ ఊహించని రీతిలో అఖిల్‌ పాత్ర ..

ఓ ఇంటర్వ్యూలో ‘థామా’లోని తన పాత్ర గురించి మాట్లాడింది రష్మిక. ‘రీసెంట్‌గా నైట్‌ షూట్‌ సన్నివేశాల్లో నటించాను. నా కెరీర్‌లో ఈ తరహా సినిమా చేయడం ఇదే మొదటి సారి. ఇందులో దెయ్యాన్ని నేనేనంటూ చాలామంది విడుదలకు ముందే భయపడుతున్నారు. కథనాలు కూడా వచ్చేస్తున్నాయ్‌. ఇందులో నేను భయపడేదాన్ని కానీ, భయపెట్టే దాన్ని కాదు’ అంటూ సమాధానం ఇచ్చింది రష్మిక.

Exit mobile version