టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్మిక పాత సంబంధం గురించి, ముఖ్యంగా కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఆమెకు జరిగిన నిశ్చితార్థం ఎందుకు రద్దయ్యిందనే విషయంపై మళ్ళీ చర్చ మొదలైంది. తాజాగా రష్మిక తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read : Telugu Cinema : వెండితెరకు ‘రక్తాభిషేకం’ మితిమీరిన వైలెన్స్‌తో హిట్లు వస్తాయా?
లీక్ అయిన ఆడియో క్లిప్ ప్రకారం.. రష్మిక మరియు రక్షిత్ శెట్టిల మధ్య గొడవలకు ప్రధాన కారణం రష్మిక కెరీర్ అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత రష్మిక సినిమాల్లో నటించకూడదని, నటనకు స్వస్తి చెప్పాలని రక్షిత్ మరియు అతని కుటుంబం డిమాండ్ చేసినట్లు సుమన్ మందన్న ఆరోపించారు. అంతేకాకుండా, సినిమాల్లో నటించనని రష్మిక సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ప్రకటించాలని కూడా వారు ఒత్తిడి తెచ్చినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రష్మిక కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘గీత గోవిందం’ సినిమా సమయంలోనే వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన ఒక కిస్సింగ్ సీన్ పట్ల రక్షిత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆ ఆడియోలో ఉంది.
Also Read : Anushka Shetty : అనుష్క ఏం చేస్తుంది.. సినిమా కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టేనా?
ఆ సమయంలో రష్మికకు అండగా నిలవాల్సింది పోయి, ఆమెతో వాదనకు దిగేవారని, ఇది రష్మికను మానసికంగా ఎంతో కుంగదీసిందని సుమన్ మందన్న పేర్కొన్నారు. రష్మికకు కేవలం 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 35 ఏళ్ల రక్షిత్‌తో నిశ్చితార్థం జరిగిందని, ఆ చిన్న వయసులోనే ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొందని ఆ ఆడియోలో ఆమె తల్లి వాపోయారు. రక్షిత్ కుటుంబ సభ్యులు తనను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసేవారని, ఆ సంబంధంలో రష్మిక ఒక ‘బానిస’లా బ్రతికిందని ఆ ఆడియోలోని సారాంశం. “మా అమ్మాయికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ఆమె ప్రశ్నిస్తూ, ఆ నిశ్చితార్థం రద్దు అవ్వడమే మంచిదైందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రష్మిక తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన తరుణంలో, ఈ పాత ఆడియో క్లిప్ బయటకు రావడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ ఆడియోపై అటు రష్మిక కానీ, ఇటు రక్షిత్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
