NTV Telugu Site icon

Girl Friend : రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కి డేట్ ఫిక్స్

New Project (10)

New Project (10)

Girl Friend : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రష్మి తన సత్తా చాటుతుంది. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. తాజాగా బాలీవుడ్ లో కూడా యానిమల్, పుష్ప 2 సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల సుందరి. ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి మన్నలను పొందింది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప టు ది రూల్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి సినిమా చిత్రీకరణలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు సంబంధించి చిత్రబృందం గతంలో పోస్టర్లను రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక చాలా క్యూట్ గా కనిపించింది. ఈ ఫోటోలను చూస్తే మళ్ళీ మళ్ళీ ఆమెను చూడాలనిపించే విధంగా ఉన్నాయి.

Read Also:CM Revanth Reddy : దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి..

ప్రస్తుతం ‘పుష్ప-2’ సక్సెస్ ను అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలో తన పర్ఫార్మెన్స్‌తో యావత్ దేశవ్యాప్తంగా శ్రీవల్లి పాత్రలో రష్మిక చేసిన పర్ఫార్మెన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఆమె ఈ సినిమాలో చేసిన డ్యాన్స్ స్టెప్పులు బాగా వైరల్ అవుతున్నాయి. ఇలా అందరు ‘పుష్ప-2’ మేనియాలో ఉండగానే, తన నెక్స్ట్ మూవీ అప్డేట్‌ తీసుకొచ్చింది. రష్మిక నటిస్తున్న నెక్స్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్ర యూనిట్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాలోని రష్మక పాత్రకు సంబంధించిన టీజర్‌ను డిసెంబర్ 9న రిలీజ్ చేయబోతున్నట్లు వారు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో రష్మిక నటనకు దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ప్రశంసలు కురిపించాడు. ఇక ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఆమె ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వనుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Read Also:Pushpa 2: ఆ ఫాన్స్ కి మాకు సంబంధం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కీలక ప్రకటన!

Show comments