నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆమె పారితోషికం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ అని, ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో వసూలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆమె రెంజ్ ని బట్టి ఇలాంటి వార్తలు రావడం కామన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై రష్మిక చాలా సరదాగా, అంతే స్పష్టంగా స్పందించారు.
Also Read :Rashmi Gautam : అడ్డుగా ఉన్నాయని కుక్కలను చంపేస్తారా.. రేపు అమ్మానాన్నలను కూడా అంతేనా?
‘నేను ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటానని అందరూ అనుకుంటున్నారు, కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. అది కేవలం ఒక అపోహ మాత్రమే. నేనేమీ హీరోను కాదు కదా.. అంత భారీ స్థాయిలో పారితోషికం తీసుకోవడానికి’ అంటూ ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆ వార్తలు నిజమైతే బాగుండేదని తాను కూడా కోరుకుంటున్నానని ఆమె చమత్కరించారు. అలాగే తమ కెరీర్ ప్రయాణం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను రష్మిక ఈ సందర్భంగా పంచుకున్నారు. 2016 లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తాను ఇప్పటివరకు ఒకే రకమైన అంకితభావంతో పనిచేస్తున్నానని ఆమె తెలిపారు. అలాగే భాషా పరమైన హద్దులు పెట్టుకోకుండా కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నానని చెప్పారు. కేవలం డబ్బు కోసమే కాకుండా, నటిగా తనను తాను నిరూపించుకునే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని రష్మిక స్పష్టం చేశారు. మొత్తానికి కష్టపడి పని చేయడమే తన బాధ్యత అని రష్మిక ఈ సందర్భంగా పేర్కొన్నారు.
