NTV Telugu Site icon

Rashmika : మహేష్ సినిమాలో రష్మిక.. ఒక్క సాంగ్‎కే అన్ని కోట్లా !

rashmika

Rashmika : పెద్ద హీరోలు సినిమాలు చేస్తున్నారంటే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం సహజం. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తీసేందుకు చిత్ర యూనిట్లు ఎంతకైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు. ఒకవేళ ఆ సినిమాలో కనుక స్పెషల్ సాంగ్ ఉంటే దానిని చేసేందుకు ఎవరో ఒక స్టార్ సెలబ్రిటీతో చేయిస్తుంటారు. వారికీ భారీగానే ముట్టజెప్పుతారు. స్టార్‌ హీరోయిన్స్‌ స్పెషల్‌ సాంగ్‌ చేస్తే.. సినిమాకు ఆ సాంగ్‌ బాగా ప్లస్ అవుతోంది. అందుకే మన దర్శకనిర్మాతలు స్పెషల్‌ సాంగ్‌పై స్పెషల్‌ కేర్‌ తీసుకుంటారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా, ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించారు. ఇప్పుడు రష్మిక మందన్నా వంతు వచ్చింది. పుష్పతో స్టార్ హీరోయిన్‌గా మారిన రష్మికకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ భారీగా డిమాండ్ ఉంది. తన డిమాండ్ కు తగ్గట్లే పారితోషికం కోరుతుంది అమ్మడు. ఇంత బిజీగా ఉన్నా..ఐటెం సాంగ్స్ వచ్చినా కాదనడం లేదు. కానీ తన క్రేజ్‌కు తగ్గట్టు డిమాండ్ చేసి అందర్నీ నివ్వెరపరుస్తోంది. అందుకే మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో ఐటెం సాంగ్‌కు ఓకే చెప్పేసింది. కానీ ఆ ఐటెం సాంగ్ కోసం ఎంత అడిగిందో తెలిస్తే నోరెళ్లబెడతారు.

Read Also: Pushpa 2 : అక్కడ ఇక్కడ ఒకే సారి తగ్గేదేలే.. అంటున్న అల్లు అర్జున్

త్రివిక్రమ్ మహేశ్‌తో ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ ప్రస్తుతం నడుస్తోంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ ఇప్పటికే పూజా హెగ్డే, శ్రీలీలను హీరోయిన్లుగా ఎంచుకున్నారు. ఇందులో స్పెషల్ సాంగ్ ఉండడంతో రష్మికను ఇందుకు ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రష్మిక ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేసిందట. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. అన్నట్టు రష్మికకు ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో కలిసి వారసుడు సినిమా చేస్తోంది. అటు చియాన్ విక్రమ్ సినిమాకు కూడా రష్మిక దాదాపుగా ఖరారైంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్దతో కలిసి మిషన్ మజ్ను చేస్తోంది.

Show comments