Xi Jinping: చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ దేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జిన్‌పింగ్ పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. జిన్‌పింగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చైనాలోని హైడియన్ జిల్లాలో బ్యానర్లు వెలిశాయి. అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించేందుకు స్కూళ్లు, పని ప్రాంతాల నుంచి ప్రజలు సమ్మె చేయాలని ఓ బ్యానర్‌లో పేర్కొన్నారు. కరోనా పరీక్షలు, లాక్ డౌన్లు తమకు వద్దని, తాము స్వేచ్ఛ కోరుకుంటున్నామని మరో బ్యానర్‌లో కనిపించింది.
మరోవైపు నిరసన కారుల్ని అడ్డుకునేందుకు డ్రాగన్ ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. చైనాలో ఉన్నత స్థాయి నేతలు, అదీ.. అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడం చాలా అరుదు. అలాంటిది కమ్యూనిస్టు పార్టీ సమావేశాల ముందు ఈ ధర్నా షాక్‌కు గురిచేస్తోంది. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా రాజధాని బీజింగ్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు నిరసన కారుల్ని అడ్డుకునేందుకు డ్రాగన్ ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది.
చైనా నగరం షాంఘైను లాక్‌డౌన్ భయాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఒక్కరోజే అక్కడ 47 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రెస్టారెంట్లు బార్లు, పార్కులు, దుకాణాలు అన్నీ మూతపడగా కొద్ది రోజులుగా పరిస్థితులు సద్దుమణిగాయి. తాజాగా షాంఘైలో 47 కేసులు, బీజింగ్‌లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. జులై 12 తర్వాత మళ్లీ ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
Earthquake: ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో భూకంపం
ఐదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు మొదలవుతున్న వేళ లాక్‌డౌన్ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించే నాయకులు.. కొవిడ్‌ను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి. కొవిడ్ కట్టడిలో భాగంగా చైనా ప్రభుత్వం కఠినంగా అమలు చేసే జీరో కొవిడ్ విధానం గురించి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.. స్పందించిన ప్రభుత్వం వాటిని తొలగించింది.