Thopudurthi Prakash Reddy: మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరాంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. నాలుగున్నరేళ్లు మొద్దు నిద్రపోయిన పరిటాల సునీత ఇప్పుడు వచ్చారని ఎద్దేవా చేసిన ఆయన.. కొడుకును ధర్మవరం పంపి.. ఇక్కడ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి పబ్బులు కూడా నడుపుతున్నారని ఆరోపించారు. 2019 ఫిబ్రవరిలో ఎస్‌కేసీ కంపెనీ 52 పనులు కాంట్రాక్ట్ తీసుకుంది.. ధర్మవరంలో 19 రోడ్లు ప్రారంభించి 16 పూర్తి చేశారు.. రాప్తాడు నియోజకవర్గంలో 33 రోడ్లు ప్రారంభించి ఇప్పటికీ మూడు కూడా పూర్తి చేయలేదని పేర్కొన్నారు. ధర్మవరం మీద వీరికి ప్రేమ ఎక్కువైందని.. రాప్తాడు ప్రజలు ఓడించారని వారిపై కక్ష కట్టారు.. అందుకే ఇక్కడ నాలుగున్నరేళ్లుగా నరకం చూపిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
Read Also:Lic Jobs 2023: ఎల్ఐసీ లో ఫైనాన్స్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని ఉద్యోగాలంటే?
కాగా, రిగ్గింగ్ చేసి గెలిచిన చరిత్ర పరిటాల కుటుంబానిది అంటూ గతంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అధికారంలో ఉండి ఆ మాటలు మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ ప్రకాష్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత కూడా అదే స్థాయిలో మండిపడ్డారు. 2009 ఎన్నికల్లో పరిటాల సునీత కర్ణాటక నుంచి మనుషుల్ని రప్పించి 2000 దొంగ ఓట్లు వేస్తే 1700 మెజార్టీతో గెలిచారని విమర్శించిన ప్రకాష్ రెడ్డి.. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి హైదరాబాదులో తలదాచుకున్నారు. మాకు రాప్తాడు వద్దు ధర్మవరం కావాలి పెనుగొండ కావాలి అంటూ టీడీపీ అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చారంటూ ఆరోపించిన విషయం విదితమే.