Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెటర్ పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ వివాహానికి ముందే విడిపోయారు.సుమారు ఆరు నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట, తాజాగా తాము విడిపోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆకృతి అగర్వాల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ఒక పోస్ట్ పెట్టడం ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు.
భవిష్యత్తు పట్ల తమ ఇద్దరికీ వేర్వేరు లక్ష్యాలు, భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని గుర్తించిన తర్వాతే తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు, బాధ్యతలరీత్యా తమ జీవిత మార్గాలు వేర్వేరుగా ఉండాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నట్లు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. తాము విడిపోయినప్పటికీ ఒకరిపై ఒకరికి ఇప్పటికీ గౌరవం ఉందని స్పష్టం చేశారు.
Also Read
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
తాము ముందుకు సాగుతున్న ఈ తరుణంలో ఇద్దరి జీవితాలు ప్రశాంతంగా, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆకృతి తెలిపారు. అలాగే ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, తమ నిర్ణయానికి దారితీసిన కారణాలపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ అనూహ్య పరిణామంతో వివాహం జరగకుండానే పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌ల నిశ్చితార్థ బంధం ఆరు నెలలకే ముగిసింది.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!