Jyoti Deshpande: రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ సినిమా 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ఊహించని స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజునుంచే మంచి టాక్ వచ్చింది. ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుగొట్టింది. ఈ సినిమా విజయంపై నిర్మాత జ్యోతి దేశ్‌పాండే తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ఫార్చూన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి దేశ్‌పాండే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇది కేవలం మేకర్స్ గెలుపు కాదని, ప్రేక్షకుల విజయమని స్పష్టం చేశారు. చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ఊహాశక్తిని పూర్తిగా ఆకట్టుకున్న సినిమా ఇదేనని గర్వంగా తెలిపారు. ఈ సినిమాను ఒక్కసారి చూసిన ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వరుస కట్టారన్నారు. 60 రోజులకు పైగా థియేటర్లలో నిలబడటం అంటే అది సాధారణ విషయం కాదన్నారు. ఈ సినిమాను ఆమె లెజెండరీ మూవీ ‘షోలే’తో పోల్చారు. షోలే తర్వాత ఇంత స్థాయిలో ప్రభావం చూపిన సినిమా గుర్తుకు రావడం లేదని తెలిపారు.
READ MORE: Aavesham 2: రంగన్న ఈజ్ బ్యాక్! ‘ఆవేశం 2’పై ఫహద్ ఫాజిల్ అఫీషియల్ క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇక ‘ధురంధర్ 2’ అంశంపై జ్యోతి దేశ్‌పాండే తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే. మొదటి భాగం హిట్ కాకపోతే రెండో భాగం అల్మారాలోనే ఉండిపోయేదని జ్యోతి దేశ్‌పాండే నిజాయితీగా చెప్పారు. కానీ మొదటి భాగం తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకంతోనే రెండో భాగంపై ముందే పని మొదలుపెట్టామని అన్నారు. ప్రేక్షకులు సినిమాను ఇంతగా ఆదరించడంతో తమ ఆనందానికి హద్దులేదని చెప్పారు. ‘ధురంధర్ 2’ మొదటి వర్షన్ కంటే అద్భుతంగా ఉంటుందని.. ఈసారి ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నామని వెల్లడించారు. ధురంధర్ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ఒక్క భాషలో వచ్చిన సినిమా ఇంత పెద్ద స్థాయిలో విజయం సాధించడం ఇదే మొదటిసారి అని జ్యోతి చెప్పారు. ఈ సినిమా సౌత్ సినిమాల రికార్డులను బద్దలు గొట్టిందని అన్నారు. హిందీ వెర్షన్‌కే దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన కలెక్షన్లు, ఇతర పెద్ద హిందీ సినిమాల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. పాకిస్థాన్‌లోనూ అత్యధికంగా చూసిన సినిమాగా ధురంధర్ నిలిచిందని చెప్పారు.
READ MORE: Sarvam AI: ఏఐ రంగంలో భారత్ సంచలనం.. చాట్‌జీపీటీ, జెమినీలను వెనక్కి నెట్టిన భారత్ ఏఐ!
