Ranveer Singh: డైరెక్టర్ శంకర్ కుమార్తెతో డ్యాన్స్ తో అలరించిన రణ్వీర్ సింగ్.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినీ దర్శకుడు శంకర్.. తాజాగా ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తరుణ్ కార్తీక్ తో ఐశ్వర్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలలో భాగంగా చెన్నై నగరంలో మంగళవారం నాడు జరిగిన వివాహ విందులో భాగంగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేవలం దక్షిణాది సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. బాలీవుడ్ కు చెందిన అగ్రతారలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also read: Ponnam Prabhakar: శ్రీ రామనవమి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతుల ప్రత్యేక పూజలు
Also Read
ఇక దక్షిణాది సినీ పరిశ్రమల నుంచి చిరంజీవి దంపతులు, విజయ్ సేతుపతి, అట్లీ, మోహన్‌లాల్, లోకేష్ కనకరాజు, రకుల్ ప్రీత్ సింగ్, అనిరుద్, ఏ ఆర్ రెహమాన్, హీరో రామ్ చరణ్ లాంటి అగ్ర తారలు హాజరై నూతన వధూవరులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంకి బాలీవుడ్ అగ్రకత నాయకుడైన రణ్వీర్ సింగ్ కూడా హాజరయ్యాడు. కేవలం హాజరు అవ్వడమే కాకుండా.. శంకర్ చిన్న కుమార్తె అదితితో కలిసి ఆయన ‘లుంగీ డాన్స్’ అలాగే ‘వాటి కమింగ్’ వంటి పాటలకు డాన్స్ చేశారు.
Also read: Gold Price Today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
వీరితో పాటు డైరెక్టర్ అట్లీ కూడా ఈ డాన్స్ లో కాలు కదిపాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే శంకర్ మొదటి కుమార్తె ఐశ్వర్య ఓ వైద్యురాలు. ఈడకు ఇది రెండో వివాహం. 2021 లో ఇదివరకే క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో వివాహం జరగగా వారిద్దరు పరిష్కార అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఐశ్వర్య పెళ్లి చేసుకున్న తరుణ్ కార్తీక్ సినీ పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ నిర్మిస్తున్న రెండు భారీ ప్రాజెక్టులలో కూడా ఆయన పని చేస్తున్నాడు.
#RanveerSingh #AditiShankar #Arjithsankar killing the dance floor with #ThalapathyVijay𓃵 ATBB #ApidiPodu song in @shankarshanmugh elder daughter wedding @actorvijay #GhilliReRelease pic.twitter.com/fpDxLzQfkK
— Suresh samy (@sureshsamy28) April 16, 2024
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?