NTV Telugu Site icon

Ranjith Reddy: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంజిత్ రెడ్డి..

Ranjith

Ranjith

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డి ఈరోజు (మంగళవారం) నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంకకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. శుభప్రదమైన ఆంజనేయ స్వామి జయంతి రోజున.. తాను తన మొదటి సెట్​ నామినేషన్​ వేయడం ఆ భగవంతుడి దివ్యమైన ఆశీస్సులుగా భావిస్తున్నట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ ర్యాలీలో తాండూరు ఎమ్మెల్యే బి. మనోహర్​ రెడ్డి.. చేవెళ్ళ, రాజేంద్రనగర్​ ఇంఛార్జీలు భీం భరత్, కస్తూరి నరేందర్, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు​ తదితరులు పాల్గొన్నారు.

Rahul gandhi: అమేథీలో రాహుల్ ఇల్లు క్లీనింగ్.. ఏం జరుగుతోంది!

కాగా.. రెండో సెట్​ నామినేషన్ ​ను ఏప్రిల్​ 25న(గురువారం) వేయనున్నట్లు రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోజు జన ప్రభంజనంతో జైత్రయాత్రగా భారీ ర్యాలీగా వచ్చి ముఖమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మరోసారి నామినేషన్ సమర్పించనున్నట్లు చెప్పారు. నామినేషన్​ దాఖలు కార్యక్రమానికి భారీ సంఖ్యలో రావాలని.. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. తను ఎంతో నిస్వార్ధంగా కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నట్లు వివరించారు. భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Pragati : గల్లీలో బుల్లెట్ పై ప్రగతి ఆంటీ.. వీడియో వైరల్..

Show comments