Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- రంజీ ట్రోఫీలో బ్యాట్‌తో అదరగొట్టిన రవీంద్ర జడేజా
- ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున 102 పరుగులు
- 209 బంతుల్లో 7 ఫోర్లతో సెంచరీ నమోదు
- ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జడేజాకు ఇది 16వ సెంచరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja Century: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీట్రోఫీలో బ్యాట్‌తో సత్తాచాటాడు. ఛత్తీస్‌గఢ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జడేజా అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేసిన అతడు 209 బంతుల్లో 7 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జడేజాకు ఇది 16వ సెంచరీ కావడం విశేషం.
సౌరాష్ట్ర 120 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో జడేజా క్రీజులోకి వచ్చాడు. జట్టు నుంచి భారీ ఇన్నింగ్స్ అవసరమైన సమయంలో తొందరపడకుండా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. సుమారు 48 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతూ జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. జడేజాతో పాటు ప్రేరక్ మాంకడ్ కూడా అద్భుతంగా రాణించాడు. వీరిద్దరి కీలక భాగస్వామ్యం సౌరాష్ట్ర భారీ స్కోరు సాధించడంలో కీలకంగా మారింది. మాంకడ్ 150 బంతుల్లో 129 పరుగులు చేశాడు. చిరాగ్ జానీ 83 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌లో ఆసక్తికరమైన విషయం కూడా చోటుచేసుకుంది. అతడిని ఔట్ చేసిన బౌలర్ పేరు కూడా జడేజానే కావడం విశేషం. గతంలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన ధర్మేంద్రసింగ్ జడేజా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ తరఫున ఆడుతున్నాడు. అతడి బౌలింగ్‌లోనే రవీంద్ర జడేజా 102 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో దేవ్ ఆదిత్య సింగ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అతడు ఐదు వికెట్లు పడగొట్టగా.. ధర్మేంద్రసింగ్ జడేజా, రుద్ర ప్రతాప్ దిహారీ చెరో రెండు వికెట్లు సాధించారు. భారత జట్టు తరఫున ఒక మ్యాచ్ ఆడిన సందీప్ వారియర్‌కు ఒక వికెట్ దక్కింది.
సౌరాష్ట్రను 392 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్‌గఢ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సానిధ్య హుర్కత్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ కొట్టినా.. రెండో బంతికే ఔటయ్యాడు. చేతన్ సకారియా బౌలింగ్‌లో సమర్ గజ్జర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతానికి ఛత్తీస్‌గఢ్ స్కోర్ 11 ఓవర్లకు 34/2 గా ఉంది.
తాజావార్తలు
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!