NTV Telugu Site icon

DELHI: ప్రభుత్వ భూమిలో “రాణి లక్ష్మీబాయి” విగ్రహ ఏర్పాటు.. భూమి తమదన్న వక్ఫ్ బోర్డు.. చివరికీ..

Laxmi Bhai

Laxmi Bhai

ఢిల్లీలోని డీడీఏ భూమిపై వక్ఫ్ బోర్డు దావాను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు డీడీఏ అంటే ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ భూమిలో రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది. హైకోర్టు తీర్పు అనంతరం విగ్రహ ప్రతిష్ఠాపన కోసం డీడీఏ అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. షాహీ ఈద్గా సమీపంలోని ఈ భూమిపై నిర్ణయం తీసుకోవడంతో డీడీఏ, ఎంసీడీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విగ్రహ ప్రతిష్ఠాపన పనులు ప్రారంభించారు. భద్రత దృష్ట్యా ఈద్గా కాంప్లెక్స్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. రహదారిని మూసివేసి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

READ MORE: Ministry of Consumer Affairs: రూపాయికే ఐఫోన్! .. ప్రభుత్వం సీరియస్

13000 చదరపు మీటర్ల పార్కును ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) ఆస్తిగా ప్రకటించడం ద్వారా వక్ఫ్ బోర్డు వాదనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో వక్ఫ్ బోర్డు ఈ భూమి తమదేనని వాదించగా.. కోర్టు డీడీఏకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో రాణి లక్ష్మీబాయి విగ్రహ ప్రతిష్ఠాపనకు మార్గం సుగమమైంది. హైకోర్టు ఈ నిర్ణయం పట్ల విగ్రహ ప్రతిష్ఠాపన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహారాణి లక్ష్మీబాయి వారసత్వాన్ని గౌరవించేందుకు ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అన్నారు. మరోవైపు, హైకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు.

READ MORE: Vivo V40e Price: ఏఐ ఫీచర్లతో వివో వి40ఈ.. 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ!