Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Rangareddy Collector Narayana Reddy Suspends Panchayat Secretaries Praja Palana Negligence

Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండెడ్.. కారణం ఇదే..

Published Date :March 11, 2026 , 3:20 pm
By Veerababu
  • కీలక నిర్ణయం తీసుకున్న కలెక్టర్..
  • ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు..
  • విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కారణం..
Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండెడ్.. కారణం ఇదే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలులో అలసత్వం వహించిన అధికారులపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సంబంధిత సిబ్బందిపై వేటు వేశారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో విఫలమైన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫరూక్ నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం. సరోజపై ఈ చర్యలు తీసుకున్నారు. పై అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే విధులకు గైర్హాజరు కావడం, కార్యాలయ రికార్డుల నిర్వహణలో అస్తవ్యస్తంగా వ్యవహరించడం ఆమె సస్పెన్షన్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

Also Read:Hansika motwani: సినీ నటి హన్సికా విడాకులు.. 4 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి..

ఇదే మండలంలోని కాశిరెడ్డి గూడ పంచాయతీ కార్యదర్శి కె. వాసవాచారి కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. ప్రజా పాలన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవ్వడం, రోజువారీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడంతో ఆయనపై కూడా వేటు పడింది. ఈ నెల 9వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి (డిపివో) సురేష్ మోహన్ ఫరూక్ నగర్ మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పనుల తీరును పరిశీలించిన ఆయన పలు లోపాలను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే క్రమశిక్షణా చర్యలు అమలయ్యాయి.

Also Read:Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..

కేవలం కార్యదర్శులనే కాకుండా.. పర్యవేక్షణలో విఫలమైన ఉన్నతాధికారులను కూడా కలెక్టర్ వదలలేదు. మండలంలోని కార్యదర్శులకు సరైన దిశానిర్దేశం చేయడంలో విఫలమైన ఫరూక్ నగర్ మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) ఎం. జయంత్ రెడ్డికి ఛార్జ్ మెమో జారీ చేశారు.

కందుకూరు మండలంలోని కందుకూరు, ముచ్చర్ల, కొత్తగూడ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను కార్యదర్శులు ఇంద్రసేన రెడ్డి, శ్రీహరి, నరేందర్ గౌడ్లకు డీపీఓ షోకాజ్ నోటీసులు అందజేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Farooqnagar Mandal news
  • Narayana Reddy collector
  • Panchayat Secretary Negligence
  • Panchayat Secretary Suspension
  • Praja Palana program Telangana

తాజావార్తలు

  • Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండెడ్.. కారణం ఇదే..

  • Hansika motwani: సినీ నటి హన్సికా విడాకులు.. 4 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి..

  • Mobile Recharge Controversy: పార్లమెంటులో రీఛార్జ్ సెగ.. 12 నెలలకు 13 రీఛార్జ్ లా? కేంద్రంపై ఎంపీల ప్రశ్నల వర్షం!

  • Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..

  • Adani Total Gas: LPG కొరత మధ్య.. 18% పెరిగిన అదానీ గ్యాస్ స్టాక్.. రూ. 550 దాటి భారీ లాభాలు

ట్రెండింగ్‌

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions