హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోని రామ్‌గోపాల్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో.. మంటలను గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో ఉన్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అయితే.. మరో ఇద్దరు గురించి ఆచూకీ తెలియరాలేదు. అయితే.. భవనంలో మంటలు భారీగా ఎగిసిపడి పక్కన బిల్డింగ్‌కు కూడా వ్యాపించాయి. దీంతో భవనంలోని పలు అంతస్తుల స్లాబ్‌లు కూలీ పోయాయి. అంతేకాకుండా పక్కన బిల్డింగ్‌కు కూడా మంటలు వ్యాపించడంతో.. ఆ బిల్డింగ్‌పై కప్పు కూడా ఊడిపోయినట్లు సమాచారం.
Also Read : KCR Next Target: విశాఖపై కేసీఆర్ ఫోకస్. బీఆర్ఎస్ మలిసభ అక్కడేనా?
అయితే.. ప్రమాదం జరిగిన భవనంలో ఇప్పటికే మెట్ల మార్గం పూర్తిగా దెబ్బతింది. బిల్డింగ్ ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఒక వేళ బిల్డింగ్ కూలితే తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జనావాసాల మధ్య గోదాంలు ఏర్పాటు చేయకూడదని, జంటనగరాల్లో 25 వేల గోదాంలు జనావాసాల మధ్య ఉన్నట్లు వాటిని కూడా సీజ్ చేయాలని అన్నారు. అయితే ప్రస్తుతానికి ఇంకా మంటలు ఎగిసిపడుతుండటంతో.. రెస్యూ చేయడం కష్టంగా మారింది. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Also Read : India-The Modi Question: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. 2002 అల్లర్లపై సిరీస్.. ప్రభుత్వం ఆగ్రహం
