Site icon NTV Telugu

Ramcharan Vaction: థాయ్‌లాండ్ వెకేషన్‌ లో కూతురితో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాంచరణ్ దంపతులు..!

66

66

రామ్ చరణ్, ఉపాసన ఇటీవల థాయ్‌లాండ్ వెకేషన్ కు వెళ్లారు. వారు తిరిగి వచ్చిన కొన్ని రోజుల తరువాత., రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కొణిదెల, కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో, రామ్ చరణ్ కుటుంబం ఏనుగు పిల్లకు స్నానం చేపించడాన్ని చూడవచ్చు. నేడు.. ఉపాసన పెంపుడు కుక్క రైమ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా
రెండు ఫోటోలను పంచుకుంది. ఒక ఫోటోలో రామ్ చరణ్ తన కుమార్తె, భార్యతో కలిసి ఉన్నారు. సాధారణ దుస్తులు ధరించి, ఏనుగు పిల్లకు స్నానం చేస్తున్నప్పుడు దంపతులు నవ్వుతూ కనిపించారు.

Also read: Fire Accident: మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి

ఇక ఈ పోస్ట్ కు కాప్షన్ ను ఇలా ఉంది. “ధన్యవాదాలు నానా.. నా సోదరి, కూతురు క్లీన్ కారాతో కలిసి స్యామ్యూయ్ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించాను. సముద్రంలో ఈత కొట్టడం, అలాగే రెస్క్యూ క్యాంప్ లో ఏనుగుల రక్షణ గురించి తెలుసుకోవడం ఏంటో ఇష్టమైన పనులు చేశామని., అద్భుతమైన సంరక్షణ కోసం పుయ్, గెట్టిలకి ధన్యవాదాలు కొత్త థాయ్ కట్..” అంటూ రాసి ఉంది. ఇక రామ్ చరణ్ తన భార్య ఉపాసన, కుమార్తె క్లిన్ కారా, పెంపుడు కుక్క రైమ్తో కలిసి ఇటీవల త్వరితగతిన సెలవుల కోసం థాయ్‌లాండ్ కు బయలుదేరారు. కుటుంబం థాయ్‌లాండ్ లోని ఖో స్యామ్యూల్లోని కో స్యామ్యూయ్ అనే ద్వీపాన్ని సందర్శించింది.

Also read:Botsa Satyanarayana: మళ్లీ జగన్‌ ప్రభుత్వం రావడం ఖాయం..

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం తన లాంగ్ పెండింగ్ చిత్రం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, ఇందులో కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ ఛేంజర్ కాకుండా, రామ్ చరణ్ పై వరుసగా RC16 మరియు RC17 అనే రెండు సినిమాలు ఉన్నాయి.

Exit mobile version