Ramayana Twitter Review: ఫైట్స్ అదుర్స్.. రణబీర్, యాష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ .. ‘రామాయణం’ ఫస్ట్ షోపై ఆడియన్స్ టాక్..

Ramayana Part 1 Twitter Review

Ramayana Part 1 Twitter Review

Ramayana Twitter Review: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రామాయణం’ (Ramayana) థియేటర్లలోకి వచ్చేసింది. తొలి షో చూసిన ఆడియన్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ ఫస్ట్ రియాక్షన్స్‌ను షేర్ చేసుకుంటున్నారు. సినిమా స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), నటీనటుల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రావణాసురుడిగా యాష్ (Yash) నటన లీడ్ పాయింట్‌గా నిలిచాయి.

సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్స్ ప్రకారం.. ఈ సినిమా విజువల్స్ సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేశాయి. ఒక హాలీవుడ్ (Hollywood) రేంజ్ ప్రొడక్షన్ క్వాలిటీతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని వ్యూయర్స్ ప్రశంసిస్తున్నారు. శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ సరిగ్గా సరిపోతారా అని రిలీజ్‌కు ముందు చాలా డౌట్స్ ఉండేవి, కానీ తన యాక్టింగ్‌తో ఆ విమర్శకులందరి నోళ్లూ మూయించాడని ఫ్యాన్స్ అంటున్నారు. కథ సాగే కొద్దీ రాముడి పాత్రతో కనెక్ట్ అయిపోతామని, రణబీర్ చాలా పర్‌ఫెక్ట్‌గా ఒదిగిపోయాడని చెబుతున్నారు.

ఇక రావణాసురుడిగా యాష్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎంట్రీ నుంచే తన మాస్ అండ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో కేక పెట్టించాడని, ముఖ్యంగా జటాయువు సీక్వెన్స్ (Jatayu sequence)లో యాష్ నటన ‘బియాండ్ ఇమాజినేషన్’ అని ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. జటాయువు ఫైట్ సీన్‌లోని గ్రాఫిక్స్, ఫైట్స్ ఆడియన్స్‌ను కంటిన్యూస్‌గా ఎమోషనల్ చేశాయని, ఈ సీన్ సినిమాలోనే బెస్ట్ అని చాలామంది చెబుతున్నారు.

సీతగా సాయి పల్లవి (Sai Pallavi), లక్ష్మణుడిగా రవి దూబే (Ravie Dubey), దశరథుడిగా అరుణ్ గోవిల్ (Arun Govil) తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే, రాముడు, సీత మధ్య ఉండాల్సిన ఎమోషనల్ కనెక్షన్ (Emotional connect) కొంతమందికి ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండు అనిపించిందట. కథ పరిచయం, బ్యాక్‌గ్రౌండ్ బిల్డప్ వల్ల దాదాపు 3 గంటల 15 నిమిషాల రన్ టైమ్ కొద్దిగా స్లోగా అనిపించినా, విజువల్ గ్రాండ్‌నెస్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందని పలువురు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాకు ప్రాణం పోసింది హన్స్ జిమ్మర్ (Hans Zimmer), ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman) అందించిన మ్యూజిక్ అని పలువులు ఆడియన్స్ చెబుతున్నారు. హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (Background Score) రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ అని, ఈ విజువల్ వండర్‌ను ఖచ్చితంగా ఐమాక్స్ (IMAX) థియేటర్లలోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఆడియన్స్ సజెస్ట్ చేస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యాష్ కలిసి నిర్మించిన ఈ రెండు భాగాల ఎపిక్ మూవీ ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ (Ramayana: Rise of a Legend) ప్రేక్షకులకు ఒక గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది. పార్ట్ 1 మెప్పించడంతో, పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాబోయే పార్ట్‌లో సన్నీ డియోల్ (Sunny Deol) హనుమంతుడి పాత్రలో ఎలా కనిపించబోతున్నారో చూడటానికి ఆడియన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.