రామరాజ్యం వీర రాఘవరెడ్డి కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నట్లు తేలింది. తనకు తాను శివుడి అవతారం అని క్రియేట్ చేసుకున్నాడు వీర రాఘవరెడ్డి. శివుడి అవతారం ధరించాను అంటూ రామరాజ్యంలో రిక్రూట్మెంట్ కూడా ప్రారంభించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రామా రాజ్యంతోనే సాధ్యం అని వీడియోలు చేశాడు. కాగా.. వీర రాఘవరెడ్డిని అరెస్టు చేయటానికి గల కారణాలను పోలీసులు పేర్కొన్నారు. రామరాజ్యం పేరుతో దోపిడీ చేస్తున్నారు.. పూజారులపై భౌతిక దాడులు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీర రాఘవరెడ్డికి గతంలోనూ నేర చరిత్ర ఉందని అన్నారు. ఒకవేళ వీర రాఘవరెడ్డిని అరెస్టు చేయకుంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. వీర రాఘవరెడ్డిపై 2015, 2016లోనే కేసులు ఉన్నాయని వెల్లడించారు. చిలుకూరు రంగరాజన్‌కు ఉగాది వరకు సమయం ఇస్తున్నామని వీర రాఘవరెడ్డి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Sangareddy Crime: కూతురితో చనువుగా ఉంటున్నాడని వ్యక్తిని హత్య చేసిన తండ్రి..
కాగా.. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు 20 మందికి పైగా వ్యక్తులు ఆయనపై దాడి చేయడంతో ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన కొవ్వూరి వీర రాఘవ రెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన వీర రాఘవ రెడ్డి, రామరాజ్యం అనే ప్రైవేట్ సైన్యాన్ని నడిపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా రామరాజ్యం స్థాపన కావాలని ప్రచారం చేస్తున్న అతడు.. పదో తరగతి పాసైన లేదా ఫెయిల్ అయిన యువకులను తన సైన్యంలో రిక్రూట్ చేస్తూ వచ్చాడు. వీర రాఘవ రెడ్డి తన రామరాజ్యం సైన్యంలో చేరాలని అర్చకుడు రంగరాజన్‌పై ఒత్తిడి చేశాడు. రంగరాజన్ దానికి నిరాకరించడంతో అతనిపై తీవ్రంగా దాడి చేశాడు.
Read Also: Trikala : ఆసక్తికరంగా ‘త్రికాల’ ట్రైలర్